హైదరాబాద్ : ఆదిత్యా బిర్లా గ్రూపు కంపెనీ(Cyber Crime) పేరుతో సోషల్ మీడియాలో(Social media) నకిలీ ప్రకటన వుంచి ట్రేడింగ్లో భారీ లాభాలు ఇస్తామని నమ్మించి అమాయకులను మోసం చేసిన ఓ నేరగాడిని సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పట్టుబడ్డ నేరగాడు చైనా సైబర్ నేరగాడితో దోస్తీ చేసినట్లు తేలింది. పట్టుబడ్డ నేరగాడు హైదరాబాద్ లో ఓ వ్యాపారిని 32 లక్షల రూపాయలు మోసం చేసినట్లు తేలింది. నెల రోజుల క్రితం సో షల్ మీడియాలో వచ్చిన ప్రకటనను నమ్మిన వ్యాపారి దీనిని క్లిక్ చేయగా సదరు నేరగాడు ఫోన్లో మాట్లాడాడు. అనంతరం సైబర్ నేరగాడు వ్యాపారిని మాటల్లో ముంచెత్తి ట్రేడింగ్లో లాభాలుంటాయని చెబుతూ తాను సూచించిన వాటిలో పెట్టుబడులు పెట్టాలని సూచించి 32 లక్షల రూపాయలు కాజేశాడు. దీని తరువాత సైబర్ నేరగాడు పత్తా లేకుండా పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Read also: Azharuddin: గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై విచారణ

చైనా సైబర్ నేరగాడితో కలిసి గోల్మాల్
ఈ ఫిర్యాదు(Cyber Crime) ఆధారంగా వి చారించగా ఈ గోల్మాల్కు పాల్పడింది ముంబాయికి చెందిన ఒమర్గా తేలింది. అతను చైనా సైబర్ నేరగాడితో కలిసి కొంతకాలంగా భారత్లో గోల్మాల్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలింది. ఇతని ముఠాలో గుజరాత్కు చెందిన రిషీ తుషార్, వినాయక్ రాజేందర్లు వున్నారని తేలింది. వీరంతా చైనా నేరగాడికి మ్యూల్ ఖాతాలు ఇస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దేశ వ్యాప్తంగా 12 కేసుల్లో వీరు నిందితులుగా తేలింది. ఈ క్రమంలో చైనా నేరగాడికి 50 లక్షల రూపాయలు క్రిప్టో కరెన్సీ ద్వారా ఇచ్చినట్లు తేలింది. పట్టుబడ్డ ఒమర్ నుంచి లాప్టాప్ పాటు సెల్పోను ఇం కొన్ని వస్తువులను జప్తు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: