ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక సైబర్ నేరాలు(Cyber Crime) రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని పోలీసులు నెత్తినోరు కొట్టుకుని వాచ్చరిస్తున్నా..మోసపోతూనే ఉన్నాం. కష్టపడి సంపాదించిన డబ్బు క్షణాల్లో సైబర్ నేరగాళ్లకు(Cyber Crime) చేరిపోతుంది. రాత్రీపగలు కష్టపడి, పైసాపైసా కూడిబెట్టిన మన కష్టం పరాయిపాలై పోవడం తీవ్ర ఆవేదన కలిగించే విషయం. తాజాగా ఓ సైబర్ నేరగాడి వలలో పడిన వ్యక్తి ఏకంగా 11లక్షలు పోగొట్టుకున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Also: Supreme Court: వీధి కుక్కల కేసులో రాష్ట్రాల సీఎస్‌లపై సుప్రీంకోర్టు ఆగ్రహం

మోసపూరిత ప్రకటనను నమ్మిన కాంట్రాక్టర్
మహారాష్ట్రలోని పుణెలో సోషల్ మీడియాలో(Social media) వచ్చిన ఒక మోసపూరిత ప్రకటనను వమ్మి 44 ఏళ్ల ఓ కాంట్రాక్టర్ ఏకంగా రూ.11లక్షలు పోగొట్టుకున్నాడు. ఆ ప్రకటనలో ఓ మహిళ.. ‘నన్ను తల్లి చేయగల ఆరోగ్యవంతుడైన పురుషుడు కావాలి. నేను గర్భవతిని చేస్తే రూ.25లక్షలు ఇస్తాను. అతను నిరక్షరాసుడైనా, ఏ కులానికి చెందినవాడైనా, అందంగా లేకపోయినా పర్వాలేదు అని చెప్పింది. ఆసక్తి ఉన్నవారు ఈ ఫోన్ నెంబర్ ను సంప్రదించాలంటూ ఈ వీడియోలో నెంబర్ కూడా షేర్ చేసింది. దీంతో దీనికి ఆకర్షితుడైపోయిన ఆ కాంట్రాక్టర్ వెంటనే ఆ నంబర్ కు కాల్ చేశాడు. అప్పుడు తాను ‘ప్రెగ్నెంట్ జాబ్ సంస్థ’లో అసిస్టెంట్ గా పనిచేస్తున్నానని చెప్పుకున్న ఒక వ్యక్తి కాల్ అందుకున్నాడు.
నమ్మించి నట్టేంట ముచ్చారు కదురా
మహిళతో కలిసేందుకు ముందుగా సంస్థలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, కంపెనీ ఐడెంటిటీ కార్డు తీసుకోవాలని సూచించాడు. ఆ తరువాత మోసగాళ్లు ఆ కాంట్రాక్టర్ ను రిజిస్ట్రేషన్ ఫీజు, ఐడెండిటీ కార్డు పీజు, జీఎస్టీ, టీడీఎస్, ప్రాసెసింగ్ ఫీజు వంటి అనేక రకాల ఛార్జీల పేరటుతో డబ్బు వసూలు చేశారు. ఆ కాంట్రాక్టర్ సెప్టెంబరు మొదటి వారం నుండి అక్టోబరు 23వరకు, వందకంటే ఎక్కువసార్లు చిన్నచిన్న మొత్తాలలో మొత్తం రూ.11 లక్షల వరకు డబ్బు బదిలీ చేశాడు. ఇవన్నీ యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా జరిగాయి.
ఎంత డబ్బు పంపినా పని పూర్తి కాక పోవడంతో, బాధితుడు వారిని ప్రశ్నించడంతో వమోసగాళ్లు వెంటనే అతని నంబర్ ను బ్లాక్ చేశారు. తాను మోసపోయానని గ్రహించిన కాంట్రాక్టర్ ఫుడెలోని బనేర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. ఈ మోసంలో ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, బ్యాంక్ ఖాతాలపై దర్యాప్తు చేస్తున్నారు. ముక్కుమొహం తెలియని వారి మాటల్ని నమ్మి, డబ్బును పంపడం నిజంగా మన అమాయకత్వమో లేక అజ్ఞానమో తెలియదు.. చివరికి నష్టపోయేది మనమే కదా. కాబట్టి డబ్బును ఆన్ లైన్ ద్వారా బదిలీ చేస్తున్నప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. వీలైతే కుటుంబసభ్యులు, బంధువులతో షేర్ చేసుకోవాలి. అప్పుడు ఇలాంటి మోసల నుంచి కొద్దిలో కొద్దిగానైనా తప్పించుకోగలం.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: