PG Admissions: దేశంలోని వివిధ యూనివర్సిటీలలో పీజీ కోర్సులకు 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం సీయూఈటీ (CUET PG 2026) నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పరీక్షకు సంబంధించిన నోటిఫికేషన్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసింది.
Read Also: TG: ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్
CUET PG 2026 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 14, 2025 నుండి ప్రారంభమయ్యాయి. దరఖాస్తులు జనవరి 14, 2026 వరకు స్వీకరించబడతాయి. రాత పరీక్షలు 2026 మార్చ్‌లో దేశవ్యాప్తంగా 276 ప్రధాన నగరాల్లో, అలాగే 16 అంతర్జాతీయ కేంద్రాలలో నిర్వహించబడతాయి. మొత్తం 157 సబ్జెక్ట్‌లలో ఈ పరీక్షలు నిర్వహణకు సిద్ధంగా ఉన్నాయి.

ఈ పరీక్ష ద్వారా దేశంలోని సెంట్రల్ యూనివర్సిటీలతో పాటు, కేంద్రం ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు, రాష్ట్ర యూనివర్సిటీలను, డీమ్డ్ యూనివర్సిటీలను మరియు ప్రైవేట్ విద్యాసంస్థలను కలుపుతూ పీజీ కోర్సుల ప్రవేశాలను అందిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈ సంవత్సరం కూడా పీజీ CUET 2026 పరీక్షను నిర్వహించనుంది.
ముఖ్యమైన తేదీలు:
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబర్ 14, 2025
- ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జనవరి 14, 2026
- పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ: జనవరి 14, 2026, రాత్రి 11:50 వరకు
- అప్లికేషన్ సవరణ తేదీలు: జనవరి 18, 2026, రాత్రి 11:50 వరకు
- సిటీ ఇంటిమేషన్ స్లిప్ డౌన్‌లోడ్: త్వరలో వెల్లడి
- అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: త్వరలో వెల్లడి
- రాత పరీక్షలు: మార్చ్ 2026
వివరాలకు మరియు అధికారిక ప్రకటనలకు NTA(National Testing Agency) వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: