సృష్టిలో తల్లి ప్రేమకు సాటి అయిన ప్రేమ మరొకటి లేదు. అన్నం తిననని మారం చేసే చిన్నారును అమ్మ ఆప్యాయంగా గోరుముద్దల్ని కొసరికొసరి తినిపిస్తుంది. ఏ తల్లి అయినా చూసేది బిడ్డ కడుపు నిండాలని కోరుతుంది. తినేందుకు ఇష్టపడకపోతే చక్కలో ఎత్తుకుని, ఇల్లంతా తిరుగుతూ లాలిస్తూనే బొజ్జను నింపుతుంది. ఇంతటి ప్రేమను పంచే తల్లుల అనురాగం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి ఓ తల్లి కొడుకు చికెన్ కావాలని అడిగితే హ్యాపీగా చేయాల్సింది పోయి, ఆ బిడ్డను చితకబాది హతమార్చింది. ఈ అమానవీయ సంఘటన మహారాష్ట్రలోని పాల్హర్ జిల్లాలో చోటుచేసుకుంది.
Read Also: Asia Cup 2025: భారత్ ఘనవిజయం – పాక్ అభిమానుల్లో తీవ్ర నిరాశ

అప్పడాల కర్రతో చితకబాదిన తల్లి
పాల్హర్ జిల్లా ధన్సర్ గ్రామంలోని ఘోర్డిలా కాంప్లెక్స్ లో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి నివసిస్తోంది. ఆమె ఏడేళ్ల కుమారుడు చిన్మయ్ ధుమే చికెన్ కూర(Chicken curry) వండమని తల్లిని అడిగాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తల్లి ఇంట్లో ఉన్న అప్పడాల కర్రతో బాలుడి తల, శరీరంపై కొట్టింది. దెబ్బలకు తాళలేక బాలుడు తీవ్రగా గాయపడ్డాడు. అయినప్పటికీ ఆ తల్లి కనికరం చూపలేదు. గాయపడ్డ బాలుడిని ఆసుపత్రికి తీసుకెళ్ల కుండా ఇంట్లోనే వదిలేయడంతో ఆ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.
సహజమరణంగా చిత్రీకరించేందుకు నాటకాలు
పొరుగింటి వ్యక్తి ఆ మహిళ ఇంటికి వెళ్లాడు. నేలపై దుప్పటి కప్పి ఉన్న బాలుడి మృతదేహాన్ని చూశాడు. ఏమైందని తల్లిని ప్రశ్నించగా పచ్చకామెర్లతో చనిపోయాడని ఆమె తన తప్పును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించింది. అతనికి అనుమానం వచ్చి, దుప్పటి తీసి చూడగా బాలుడి ముఖం, ఛాతీపై తీవ్ర గాయాలు కనిపించాయి. వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసుల విచారణలో నిందితురాలు తన పదేళ్ల కుమార్తెపై కూడా అదే కర్రతో దాడి చేసినట్లు తేలింది. తీవ్ర గాయాలపాలైన ఆ బాలికను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలిక చికిత్స పొందుతోంది. తల్లిపై భయంతో మొదట నిజం చెప్పని పాప, తర్వాత తల్లే తమ ఇద్దరినీ కర్రతో కొట్టిందని పోలీసులకు చెప్పింది. పాపకు మెరుగైన సంరక్షణ కోసం దహనులోని ఓ ఆశ్రమానికి పంపించారు. అయితే తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఆమెపై పలు సెక్షన్లను నమోదు(Register sections) చేశారు.
పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తల్లిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. పిల్లల్ని దండించాలి కానీ, వారు చచ్చేంతగా కొట్టకూడదు. మేలు కోరే తల్లిదండ్రులు దండిస్తారు, కానీ ఆ కోవం వారు ప్రాణాలకే హాని కలిగేంతగా ఉక్రోశాన్ని ప్రదర్శిస్తే ఇలాంటి ఉపద్రవాలే జరుగుతాయి. పిల్లలు దేవుడు అనుగ్రహించిన బహుమానం. వారిని సమాజశ్రేయస్సు కోసం పెంచాలి.
ఈ సంఘటన ఎక్కడ జరిగింది?
మహారాష్ట్రలోని పాల్హర్ జిల్లా, ధన్సర్ గ్రామంలోని ఘోర్డిలా కాంప్లెక్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.
బాలుడిని ఎందుకు తల్లి కొట్టింది?
బాలుడు చికెన్ కూర చేయమని అడగడంతో తల్లి ఆగ్రహంతో అప్పడాల కర్రతో కొట్టింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: