ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) బుధవారం తన నామినేషన్ పత్రాలను అధికారికంగా దాఖలు చేశారు. ఈ కార్యక్రమం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఎందుకంటే, ఆయన నామినేషన్ దాఖలు సమయంలో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ అగ్రనేతలు హాజరై ఎన్డీఏ ఐక్యతను మరింత బలపరిచారు.నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించే సమయంలో వేదికపైనే ఒక బలమైన రాజకీయ సంకేతం వెలువడింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు, ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) వంటి అగ్రశ్రేణి నాయకులు సీపీ రాధాకృష్ణన్‌కు అండగా నిలిచారు. కూటమిలోని కీలక నేతలంతా ఒక వేదికపై కనిపించడంతో ఈ కార్యక్రమం ఎన్డీఏ శక్తి ప్రదర్శనగా మారింది.

ఉపరాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడంటే
అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ అనుభవజ్ఞుడైన రాజకీయ నాయకుడు. ఆయన గతంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా వివిధ హోదాలలో పనిచేశారు. ముఖ్యంగా, పార్టీ పట్ల ఆయనకున్న నిబద్ధత, నాయకత్వ గుణాలు ఆయనను ఈ కీలక పదవికి నడిపించాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్డీఏ తరఫున ఆయన ఖరారు కావడం వెనుక రాజకీయ లెక్కలు కూడా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ఇకపోతే,సెప్టెంబర్ 9వ తేదీన ఉపరాష్ట్రపతి ఎన్నిక జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభ సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి స్పష్టమైన మెజారిటీ ఉంది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ విజయం లాంఛనప్రాయమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. సంఖ్యాబలం దృష్ట్యా ఆయన ఎన్నిక ఏకపక్షంగానే జరగనుందని అంచనా వేస్తున్నారు.
సి. పి. రాధాకృష్ణన్ రాజకీయ ప్రస్థానం ఎలా ప్రారంభమైంది?
ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ద్వారా ప్రారంభించారు. కోయంబత్తూరులో రెండు సార్లు లోక్‌సభ సభ్యుడిగా (1998, 1999) ప్రజలకు సేవ చేశారు.
ఆయన ఏఏ ముఖ్యమైన పదవుల్లో పనిచేశారు?
సి. పి. రాధాకృష్ణన్ బీజేపీలో పలు కీలక పదవుల్లో పనిచేశారు. అలాగే, జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్‌గా కూడా నియమితులయ్యారు. ఆయన తన అనుభవంతో జాతీయ స్థాయిలో పార్టీకి మద్దతుగా నిలిచారు.
Read hindi news: hindi.vaartha.com
Read also: