CP Radhakrishnan : భారత ఉపరాష్ట్రపతి (CP Radhakrishnan) ఇటీవల భారతదేశం యొక్క 14వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర గవర్నర్ మరియు NDA నామినీ అయిన రాధాకృష్ణన్ భారత రాజకీయాల్లో 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇండియా బ్లాక్ అభ్యర్థి బి. సుదర్శన్ రెడ్డిపై విజయం సాధించారు. ఆయన 452 ఓట్లు సాధించగా, సుదర్శన్ రెడ్డి 300 ఓట్లు మాత్రమే పొందారు.
రాధాకృష్ణన్ కోయంబత్తూర్ (కర్ణాటక) స్థానం నుండి 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు. వీటిలో ఆయన రెండు సార్లు గెలిచారు. 2019లో జరిగిన చివరి ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
తాజాగా ఆయన ఆర్థిక అఫిడవిట్ ప్రజల దృష్టిని ఆకర్షించింది. భారీ స్థాయి ఆస్తులున్నప్పటికీ, ఆయన వ్యక్తిగతంగా ఒక్క కారు లేదా బైక్ కూడా లేనట్లు అఫిడవిట్‌లో ప్రకటించారు.
2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ఆయన నగదు రూ. 18.15 లక్షలు (భార్యతో కలిపి), బ్యాంక్ డిపాజిట్లు రూ. 6.53 లక్షలు, షేర్లు & బాండ్లు రూ. 1.28 కోట్లు, బీమా పాలసీలు రూ. 1.36 కోట్లు, ఆభరణాలు (బంగారం 1,284.71 గ్రాములు – విలువ రూ. 31.5 లక్షలు; వజ్రాలు 152.25 క్యారెట్లు – విలువ రూ. 1.06 కోట్లు కలిగి ఉన్నారు.
అతని స్థిరాస్తులు కూడా భారీగా ఉన్నాయి. మొత్తం విలువ రూ. 48 కోట్ల పైగా. ఇందులో వ్యవసాయ భూమి రూ. 35.09 కోట్లు, వ్యవసాయేతర భూమి 5.30 కోట్లు, వాణిజ్య భవనం 6.63 కోట్లు, తమిళనాడులో తిరుపూర్‌లోని నివాస గృహం 1.50 కోట్లు విలువ కలిగినది. ఆయనకు మొత్తం 2.36 కోట్ల రూపాయల అప్పులు కూడా ఉన్నాయి.
ఇంత పెద్ద స్థాయిలో భూములు, షేర్లు, బంగారం, వజ్రాలు ఉన్నప్పటికీ, రాధాకృష్ణన్ గారికి వ్యక్తిగతంగా ఒక్క కారు లేదా బైక్ కూడా లేదు, ఇది భారత రాజకీయాల్లో అరుదైన విషయం. సాధారణంగా రాజకీయ నాయకులు లగ్జరీ కార్లు, బైక్‌లు కలిగి ఉండగా, ఆయన సాదాసీదాగా జీవించడమే ప్రధాన లక్ష్యం.
Read also :