हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: VP వైసీపీ మద్దతు కోసం కాంగ్రెస్ రాయబారం

Vanipushpa
Latest Telugu News: VP వైసీపీ మద్దతు కోసం కాంగ్రెస్ రాయబారం

ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నిక వేళ ఏపీ(Andhra Pradesh) కేంద్రంగా కీలక రాజకీయ సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. ఎన్డీఏ- ఇండీ కూటము(NDA-India Kutami)ల నుంచి అభ్యర్ధులు బరిలో ఉన్నారు. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఉప రాష్ట్రపతికి ఓటింగ్ చేసే ఎలక్టోరల్ కాలేజ్ లో ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. అటు ఇండీ కూటమి తెలుగు వ్యక్తిని బరిలోకి దింపటంతో.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పార్టీలకు చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. కాగా, తాజాగా వైసీపీని ఎన్డీఏ మద్దతు కోరగా.. సానుకూలంగా స్పందించిన వేళ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతలు తమ వంతు ప్రయత్నాలు ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి ఎన్నిక వేళ ఉప రాష్ట్రపతి ఎన్నికలను ఎన్డీఏ – ఇండియా కూటమి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది.

VP వైసీపీ మద్దతు కోసం కాంగ్రెస్ రాయబారం
VP వైసీపీ మద్దతు కోసం కాంగ్రెస్ రాయబారం

ఏపీలో వైసీపీ మద్దతు కోరిన రాజ్ నాథ్ సింగ్
అయినా, తటస్థ పార్టీలు ఇండియా కూటమికి మద్దతు ఇవ్వకుండా ముందు గానే వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అందులో భాగంగా ఏపీలో వైసీపీ మద్దతు కోరింది. బీజేపీ అగ్రనేత రాజ్ నాథ్ సింగ్ నేరుగా మాజీ సీఎం జగన్ కు ఫోన్ చేసి ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు కోరారు. ఆ తరువాత పార్టీ నేతలతో చర్చించిన జగన్.. ఎన్డీఏకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు. ఎన్డీఏ కే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వనున్నట్లు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణ ఇప్పటికే ప్రకటించారు. కాంగ్రెస్ ప్రతిపాదన ఇటు తెలుగు రాష్ట్రాలకు చెందిన జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండి కూటమి తమ ఉపరాష్ట్రపతి అభ్యర్దిగా ప్రకటించింది. రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీలు సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం రేవంత్ కోరారు. ఇటు జగన్ ఎన్డీఏకు మద్దతు ఇవ్వటం పైన ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేసారు. అటు ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు తాము ఎన్డీఏలో ఉంటూ ప్రత్యర్థి కూటమికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. ఎన్డీఏ అభ్యర్ధి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేసారు. ఈ సమయంలోనే అనూహ్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జై రాం రమేశ్ వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డితో కీలక చర్చలు జరిపారు. ఈ ఎన్నికల్లో తమ కూటమికి మద్దతు ఇవ్వాలని కోరినట్లు సమాచారం.
ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించామని చెప్పిన జగన్
తేల్చేసిన జగన్ కాగా, తుది నిర్ణయం జగన్ తీసుకోవాల్సి ఉంటుందని సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీలో జగన్ ను ఓడించిన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వటం పైన పునరాలోచన చేయాలని… తమ కూటమికి మద్దతుగా నిలవాలని మరో కాంగ్రెస్ ముఖ్య నేత ద్వారా జగన్ వద్దకు రాయబారం చేసినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. అయితే, పార్టీ నేతలు జగన్ వద్ద తాజా ప్రతిపాదనలను ప్రస్తావించారు. దీని పైన జగన్ ఇప్పటికే ఎన్డీఏకు మద్దతు ప్రకటించామని.. ఇందులో పునరాలోచన లేదని పార్టీ నేతలు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఉపాధ్యక్షుడి పాత్ర ఏమిటి?
రాజ్యాంగం అమెరికా సంయుక్త రాష్ట్రాల ఉపాధ్యక్షుడిని సెనేట్ అధ్యక్షుడిగా పేర్కొంది. అధ్యక్షుడిగా పనిచేయడంతో పాటు, ఉపాధ్యక్షుడు సెనేట్‌లో టై ఓటును బ్రేక్ చేసే ఏకైక అధికారాన్ని కలిగి ఉంటాడు మరియు అధ్యక్ష ఎన్నికలలో వేసిన ఎలక్టోరల్ బ్యాలెట్ల స్వీకరణ మరియు లెక్కింపుకు అధికారికంగా అధ్యక్షత వహిస్తాడు.

భారత ఉపరాష్ట్రపతి జీతం ఎంత?
రాజ్యసభకు ఎక్స్-అఫీషియో ఛైర్మన్‌గా పనిచేస్తున్నందున భారత ఉపరాష్ట్రపతి జీతం నెలకు ₹400,000. వారి జీతంతో పాటు, అద్దె లేని అధికారిక నివాసం, ఉచిత వైద్య సౌకర్యాలు మరియు విమాన మరియు రైలు ద్వారా ఉచిత అధికారిక ప్రయాణంతో సహా అనేక భత్యాలు మరియు ప్రోత్సాహకాలను వారు పొందుతారు.

READ HINDI NEWS : hindi.vaartha.com

READ ALSO :

https://vaartha.com/adr-report-richest-and-poorest-chief-ministers-in-india/national/535043/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870