డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రభుత్వం ‘కంప్యూటర్ దీదీ – దీదీకా దుకాణ్’(Computer Didi Scheme) కార్యక్రమాలను ప్రవేశపెట్టింది. ఈ పథకాల ద్వారా ఎంపికైన మహిళలు తమ స్వగ్రామాల్లోనే ఉపాధి పొందేలా చర్యలు చేపడుతున్నారు.
Read Also: Nara Lokesh : మంగళగిరి దేశానికే ఆదర్శమా? లోకేశ్ పిలుపు!

దీదీకా దుకాణ్‌తో ఆన్‌లైన్ మార్కెటింగ్
కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి, ఉన్నత విద్యను పూర్తిచేసిన మహిళలను ‘కంప్యూటర్ దీదీ’లుగా ఎంపిక చేసి, ప్రభుత్వ మరియు డిజిటల్ సేవలను ప్రజలకు అందించే బాధ్యతను అప్పగిస్తున్నారు. అలాగే ‘దీదీకా దుకాణ్(Deedika Dukan)’ కార్యక్రమం ద్వారా మహిళలకు ఆన్‌లైన్ మార్కెటింగ్, ఈ-కామర్స్ వేదికల వినియోగంపై శిక్షణ అందించి, వారి ఉత్పత్తులకు విస్తృత మార్కెట్‌ను కల్పిస్తున్నారు. ఈ విధంగా మహిళల ఆదాయ వనరులను పెంచుతూ, గ్రామీణ స్థాయిలో డిజిటల్ సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: