కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సోషల్ మీడియా వేదికగా జరిగిన మాటల యుద్ధం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరి మధ్య పరోక్షంగా అధికారం, మాట నిలబెట్టుకోవడం అనే అంశాలపై చర్చ జరిగింది. ఈ వాగ్వాదానికి డీకే శివకుమార్ చేసిన ట్వీట్ నాంది పలికింది. ఆయన తొలుత, “మాట నిలబెట్టుకోవడం ప్రపంచంలోనే గొప్ప బలం” అని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలు తమ పార్టీ ఇచ్చిన హామీల అమలు లేదా వ్యక్తిగత నిబద్ధత గురించి చేసినప్పటికీ, ఇది ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన పరోక్ష విమర్శగా రాజకీయ వర్గాల్లో భావించారు.
Telugu News: America: వైట్ హౌస్ కాల్పులు..వారిని విచారించాల్సిందే: ట్రంప్
డీకే శివకుమార్ ట్వీట్‌కు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు. “ఒక మాట ప్రజల కోసం ప్రపంచాన్ని మార్చలేకపోతే అది బలం కాదు” అంటూ సిద్ధరామయ్య బదులిచ్చారు. ఈ వ్యాఖ్యల ద్వారా, కేవలం మాటలు నిలబెట్టుకోవడం కంటే, ఆ మాటలు ప్రజలకు మేలు చేసే విధంగా ఉండటమే ముఖ్యమని ఆయన పరోక్షంగా స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే, డీకే శివకుమార్ తిరిగి బదులిస్తూ, “కర్ణాటకకు మా మాట కేవలం నినాదం కాదు.. అదే మాకు ప్రపంచం” అనే పోస్టర్‌ను షేర్ చేశారు. తమ నాయకత్వంలో కర్ణాటక రాష్ట్రానికి ఇచ్చిన హామీలు కేవలం ఎన్నికల నినాదాలు కాదని, వాటి అమలుకే తాము కట్టుబడి ఉన్నామని చెప్పకనే చెప్పారు.

అనంతరం, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తమ నాయకత్వాన్ని సమర్థించుకుంటూ మరికొన్ని ట్వీట్లు చేశారు. “నా నాయకత్వంలో పలు నిర్ణయాలు తీసుకున్నా” అని ఆయన ట్వీట్లలో పేర్కొన్నారు. ఈ మొత్తం సోషల్ మీడియా వాగ్వాదం ద్వారా, కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగమయ్యాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ మాటల యుద్ధం కేవలం వ్యక్తిగత అభిప్రాయ భేదాలుగా కాకుండా, రాష్ట్ర నాయకత్వ పోరుకు అద్దం పడుతోందని, తద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఇద్దరు అగ్రనేతల మధ్య శీతల పోరు కొనసాగుతోందని స్పష్టమవుతోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/