న్యాయ వ్యవస్థలో జరుగుతున్న అవినీతికి చీఫ్ జస్టిస్ సూర్యకాంత్(CJI Surya Kant) చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. రిటైర్మెంట్ వయసు దగ్గరపడుతున్న సమయంలో.. జడ్జీలు తమ ఆదేశాలతో సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఓ కేసు విషయంలో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఆ సమయంలో చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant)ఈ వ్యాఖ్యలు చేశారు. న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోందని, రిటైర్మెంట్ సమీపిస్తున్న జడ్జీలు తమ తీర్పులతో సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. సుప్రీం ధర్మాసనంలో సీజేఐ సూర్యకాంత్‌తో పాటు జస్టిస్ జోయ్‌మాలా బాగ్చీ కూడా ఉన్నారు.మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ జిల్లా జడ్జీ తన రిటైర్మెంట్‌కు పది రోజుల ముందు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే తన సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆ జడ్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రిటైర్మెంట్ సమీపిస్తున్న సమయంలో ఆ జడ్జీ రెండు కేసుల్లో కీలకఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ఆ తీర్పులపై ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆ జడ్జీపై సస్పెన్షన్ విధించారు. పిటీషన్ దాఖలు చేసిన వ్యక్తి తన రిటైర్మెంట్‌కు ముందు సిక్సర్లు కొట్టే ప్రయత్నం చేశారని, ఈ అంశంపై లోతుగా ఏమీ చెప్పలేమని అన్నారు.
Read Also: VBGRMG: వికసిత్ భారత్ రోజ్‌గార్ బిల్లు పాస్: సభలో ఉద్రిక్తతలు

వాస్తవానికి ఆ జిల్లా జడ్జీ నవంబర్ 30వ తేదీన రిటైర్ కావాల్సి ఉన్నది. కానీ నవంబర్ 19వ తేదీన ఆయన్ను సస్పెండ్ చేశారు. అయితే ఆ జడ్జీ పదవీవిరమణ వయసును మరో ఏడాది కాలం పాటు పొడిగించాలని సుప్రీంకోర్టు తన ఆదేశాల్లో మధ్యప్రదేశ్ సర్కారుకు చెప్పింది. రెండు కీలక ఆదేశాలు ఇచ్చిన అంశం ఆ జడ్జీ కూడా తెలియదని, కానీ రిటైర్మెంట్ వయసును ఏడాది పొడిగించినట్లు చెప్పారు. రిటైర్మెంట్‌కు ముందు సంచలన ఆదేశాలు ఇవ్వడం జడ్జీలకు ఓ ట్రెండ్‌గా మారిందన్నారు. తన సస్పెన్షన్‌ను ఛాలెంజ్ చేస్తూ హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని బెంచ్ ప్రశ్నించింది. జిల్లా జడ్జీ తరపున సీనియర్ న్యాయవాది విపిన్ సంఘీ వాదించారు. అనుచిత ఆదేశాలు ఇచ్చిన జడ్జీపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం సరికాదు అని, దీని కోసం ఆయన్ను సస్పెండ్ చేయలేమని సుప్రీం ధర్మాసనం పేర్కొన్నది. పిటీషనర్ హైకోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: