భారతీయ న్యాయ వ్యవస్థ చాలా భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నదని, దాంట్లో ఉన్న లోపాలను సరి చేయాల్సిన అవసరం ఉందని సీజేఐ బీఆర్ గవాయ్ (CJI BR Gavai) తెలిపారు. హైదరాబాద్‌లోని నల్సార్ యూనివర్సిటీలో జరిగిన స్నాతకోత్సవంలో పాల్గొని ఆయన (CJI BR Gavai) మాట్లాడారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు స్కాలర్‌షిప్‌ల ఆధారంగా వెళ్లాలని, కుటుంబంపై ఆర్థిక భారం మోపకుండా ఉండాలని ఆయన సూచన చేశారు. మన భారతీయ న్యాయ వ్యవస్థను సమూలంగా మార్చాల్సిన (To be radically changed)అవసరం ఉందని, ఆ సవాళ్లకు తగినట్లు పౌరులు రాణిస్తారని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉత్తమ టాలెంట్
మన దేశం, న్యాయ వ్యవస్థ.. రెండూ భిన్నమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కొన్ని కేసుల్లో విచారణ దశాబ్ధాల పాటు సాగుతుందని, కొన్నేళ్లు జైలు జీవితం అనుభవించిన తర్వాత వాళ్లు నిర్దోషులని కొన్ని కేసుల్లో తేలుతున్నాయని సీజేఐ బీఆర్ గవాయ్ (CJI BR Gavai)తెలిపారు. మన వద్ద ఉన్న ఉత్తమ టాలెంట్ ఆ సమస్యలను తీర్చుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. పాస్ అవుట్ అవుతున్న గ్రాడ్యుయేట్లు సమగ్రతపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, సుప్రీంకోర్టు జడ్జీ పీఎస్ నర్సింహా, తెలంగాణ సీజే సుజోయ్ పౌల్ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ గవాయి న్యాయమూర్తి ఎవరు?
భూషణ్ రామకృష్ణ గవై (జననం 24 నవంబర్ 1960), బిఆర్ గవైగా ప్రసిద్ధి చెందిన ఒక భారతీయ న్యాయవాది, ప్రస్తుతం 14 మే 2025 నుండి భారతదేశ 52వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఆయన బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి మరియు ప్రస్తుతం కొన్ని జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల (NLUలు) ఛాన్సలర్‌గా కూడా పనిచేస్తున్నారు.
బిఆర్ గవాయ్ కేసు ఎంత ప్రసిద్ధి చెందింది?
మే 24, 2019న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన జస్టిస్ గవాయ్, ఆర్టికల్ 370, ఎలక్టోరల్ బాండ్లు మరియు రూ. 1,000 మరియు రూ. 500 కరెన్సీ నోట్ల రద్దు వంటి విప్లవాత్మక తీర్పులు ఇచ్చిన రాజ్యాంగ ధర్మాసనాలలో భాగంగా ఉన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also:Jitender Reddy: కాన్‌స్టిట్యూషన్ క్లబ్ కోశాధికారిగా మాజీ ఎంపీ