రాజ్యసభలో జరిగిన హడావుడి మధ్య కాంగ్రెస్ నేత మల్లిఖార్జున్ ఖర్గే (Mallikarjun Kharge)తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన సభలో కేంద్ర పారామిలటరీ దళమైన సీఐఎస్ఎఫ్ (CISF) సిబ్బందిని వినియోగిస్తున్నారని ఆరోపించారు. ఇది లోకతంత్ర ప్రమాణాలకు వ్యతిరేకమని, సభ వ్యవస్థపై దాడి అని ఖర్గే వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఈ ఆరోపణలను ఖండిస్తూ, సభలో కేవలం పార్లమెంటరీ మార్షల్స్ మాత్రమే ఉన్నారని స్పష్టంగా తెలిపారు. సీఐఎస్ఎఫ్ (CISF)సిబ్బంది ఎక్కడా వినియోగించలేదని, ఖర్గే ఆరోపణలు నిరాధారమైనవని అన్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ రాజ్యసభలో గందరగోళం నెలకొన్నది. విపక్షాలు చేపట్టిన నిరసనను డిప్యూటీ చైర్మెన్ హరివంశ్ తప్పుపట్టారు. మల్లిఖార్జున్ రాసిన లేఖను మీడియాకు రిలీజ్ చేయడం లేదని హరివంశ్ తెలిపారు. సభలో విపక్ష సభ్యులు చేస్తున్న నిరసనను డిప్యూటీ చైర్మెన్ ఖండించారు. మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. సభలో సాయుధ బలగాలను మోహరించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు.

సీఐఎస్ఎఫ్ (CISF)సిబ్బంది.. వెల్‌లోకి దూసుకువస్తున్నారని, ఇది ఆశ్చర్యకరంగా, షాకింగ్‌గా ఉన్నట్లు ఖర్గే ఆరోపించారు. సభ్యులు తమ ప్రజాస్వామ్య బద్దమైన హక్కుల అంశంలో నిరసన చేపడుతున్నప్పుడు సీఐఎస్ఎఫ్ దళాలు ఎలా వచ్చాయని ఖర్గే ప్రశ్నించారు. నిన్న ఇదే జరిగింది, ఇవాళ ఇదే జరిగిందన్నారు. మన పార్లమెంట్ అంత దిగజారిపోయిందా అని అడిగారు. భవిష్యత్తులో సీఐఎస్ఎఫ్ దళాలు.. హౌజ్ వెల్‌లోకి దూసుకువస్తారని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. హౌజ్ వెల్‌లోకి కేవలం మార్షల్స్‌ను మాత్రమే అనుమతిస్తారని కేంద్ర మంత్రి రిజిజు తెలిపారు. ఖర్గే సభను తప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. సీఐఎస్ఎఫ్ సిబ్బంది హౌజ్‌లో ఉన్నట్లు ఖర్గే చేసిన ఆరోపణలను ప్రభుత్వం ఖండించింది. సభను చైర్మెన్ నడిపిస్తున్నారా లేక మంత్రి అమిత్ షా నడిపిస్తున్నారా అని ఖర్గే ప్రశ్నించారు. విపక్ష సభ్యుల అరుపుల నడుమ రాజ్యసభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు. మరో వైపు కేంద్ర సర్కారు.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచనున్నది. సీఐఎస్ఎఫ్ బలగాల సంఖ్యను 2,20,000కు పెంచనున్నారు. దీని కోసం కేంద్ర హోంశాఖ ఆమోదం కూడా తెలిపింది. 2029 నాటికి మరో 70 వేల మంది సీఐఎస్ఎఫ్ సిబ్బందిని రిక్రూట్ చేయనున్నారు.
సిఐఎస్ఎఫ్ ఆర్మీ లేదా పోలీసునా?
అస్సాం రైఫిల్స్ (AR), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (NSG) మరియు సశస్త్ర సీమా బల్ (SSB) వంటి సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPFs) గా పిలువబడే సాయుధ పోలీసు సంస్థలు,
సీఐఎస్ఎఫ్ యుపిఎస్సి పరిధిలో ఉందా?
సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)లో అసిస్టెంట్ కమాండెంట్ల (ఎగ్జిక్యూటివ్) ఖాళీల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించే పోటీ పరీక్షలలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అసిస్టెంట్ కమాండెంట్ ఎగ్జిక్యూటివ్ లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామ్ (CISF AC(EXE) LDCE) ఒకటి .
సిఐఎస్ఎఫ్ బెటాలియన్ పరిమాణం ఎంత?
కొత్తగా మంజూరు చేయబడిన ప్రతి బెటాలియన్‌లో 1,025 మంది సిబ్బంది ఉంటారు, మొత్తం CISF బెటాలియన్ల సంఖ్య 13 నుండి 15కి పెరుగుతుంది మరియు 2,050 కొత్త పోస్టులు సృష్టించబడతాయి. రెండు బెటాలియన్లకు సీనియర్ కమాండెంట్ హోదా అధికారులు నాయకత్వం వహిస్తారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Anil Ambani: నేడు ఈడీ ఎదుట హాజరు కానున్న అనిల్ అంబానీ