బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి ఘనవిజయాన్ని సాధించింది. ఈ గెలుపులో లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వన్ అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ ఎన్నికల్లో 29 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 19 స్థానాల్లో గెలిచింది. అయితే శనివారం సీఎం నితీశ్ కుమార్ ఇంటికి చిరాగ్ పాశ్వన్ వెళ్లారు.
Read Also: Bihar Results: కుటుంబంతో తెగదెంపులతో పటు రాజకీయాలకు గుడ్‌బై లాలూ కుమార్తె
ఆయనతో చర్చలు జరిపిన అనంతరం చిరాగ్ (Chirag Paswan) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించామని పేర్కొన్నారు. 2020 అసెంబ్లీ ఎన్నికల్లో తన పని అయిపోయిందని అందరూ అనుకున్నారని.. కానీ ఈసారి వచ్చిన విజయం తనకు ఎంతో విలువైనదని తెలిపారు.2005లో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసి 29 స్థానాల్లో విజయం సాధించిందని,

ఆ తర్వాత ఇవే తమకు అత్యుత్తమ ఫలితాలు అని అన్నారు. తమ కూటమిలో ఎల్‌జేపీ, జేడీయూ పాత్రపై ఎన్నికల సమయంలో ఎన్నో అసత్య ప్రచారాలు చేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ తాము కలిసికట్టుగా ముందుకు సాగామని అన్నారు.
విబేధాలు సృష్టించే ప్రయత్నం చేశారని
2025లో మాపై నమ్మకం ఉంచి ఎన్డీయే మాకు ఐదు ఎంపీ స్థానాలు కేటాయిస్తే విజయం సాధించామని, ఒక్క ఎమ్మెల్యే లేని మాకు 29 స్థానాలు కేటాయిస్తే 19 గెలుచుకున్నామని అన్నారు.గెలవలేని స్థానాలను తమకు కావాలనే ఇచ్చారని జేడీయూపై విమర్శలు చేశారని,
తద్వారా తమ మధ్య విబేధాలు సృష్టించే ప్రయత్నం చేశారని అన్నారు. కానీ ఈ ఫలితాలు ఆ ఆరోపణలను తిప్పికొట్టాయని అన్నారు. ఆర్జేడీ క్రమంగా తన ప్రాబల్యాన్ని కోల్పోతోందని చిరాగ్ పాశ్వాన్ (Chirag Paswan) అన్నారు. 90లలో నడిచిన జంగిల్ రాజ్‌ను ప్రజలు మరోసారి తిప్పికొట్టారని అన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: