China Arunachal Pradesh : అరుణాచల్‌ప్రదేశ్‌పై చైనా ఎప్పటికీ రాజీపడే ఉద్దేశం లేదని అమెరికా పెంటగాన్ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది. భారత్‌కు చెందిన ఈ ప్రాంతాన్ని చైనా తన జాతీయ భద్రతా ప్రణాళికలో కీలక భాగంగా పరిగణిస్తోందని స్పష్టం చేసింది. 2049 నాటికి తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించడమే చైనా తుదులక్ష్యమని ఆ నివేదిక పేర్కొంది.
పెంటగాన్ నివేదిక ప్రకారం, తైవాన్, సెంకాకు ద్వీపాలు, అలాగే భారత్‌లోని అరుణాచల్‌ప్రదేశ్ వంటి ప్రాంతాలు చైనా జాతీయ పునరుజ్జీవ వ్యూహంలో భాగంగా ఉన్నాయి. ఈ ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం ద్వారా చైనా మూడు ప్రధాన లక్ష్యాలను సాధించాలని చూస్తోందని తెలిపింది. అవి— చైనా కమ్యూనిస్టు పార్టీపై పూర్తి నియంత్రణ కొనసాగించడం, ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం, అలాగే సార్వభౌమాధికారం మరియు ప్రాదేశిక దావాలను బలపరచడం.
Read also: H1B Visa: అమెరికా వీసాలపై కఠిన నిబంధనలు
అయితే చైనా కమ్యూనిస్టు పార్టీ తన పాలనకు దేశంలోపల, (China Arunachal Pradesh) బయట నుంచి వచ్చే విమర్శలను తీవ్రమైన ముప్పుగా భావిస్తోందని నివేదిక పేర్కొంది. పార్టీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ నేతలు, ఉద్యమాలను విదేశీ శక్తుల మద్దతుతో పనిచేసే వేర్పాటువాదులుగా చిత్రీకరిస్తోందని తెలిపింది.
ఇక భారత్–చైనా మధ్య LAC వెంబడి కొనసాగుతున్న ఉద్రిక్తతలపై కూడా పెంటగాన్ కీలక విషయాలు వెల్లడించింది. గత ఏడాది బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య జరిగిన భేటీ, ఇరుదేశాల సంబంధాలను పునరుద్ధరించడానికి మార్గం చూపిందని పేర్కొంది. ఈ తగ్గిన ఉద్రిక్తతలను ఉపయోగించుకుని భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చాలని చైనా యోచిస్తున్నట్లు తెలిపింది.
అదే సమయంలో భారత్–అమెరికా సంబంధాలు మరింత బలపడకుండా అడ్డుకోవడంపై చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోందని కూడా పెంటగాన్ నివేదిక స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also: