
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఛత్తీస్‌గఢ్‌లో(Chhattisgarh Visit) పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అంతర్జాతీయ సంక్షోభాల సమయంలో భారత్ ఎప్పుడూ ముందుండి స్పందిస్తుందని ఆయన పేర్కొన్నారు. విపత్కర సమయాల్లో ఇతర దేశాలకు సాయం చేయడం భారత సంస్కృతిలో భాగమని అన్నారు. నవ రాయ్‌పూర్‌లో బ్రహ్మకుమారీలకు చెందిన కొత్త భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ — రాష్ట్రాల పురోగతితోనే దేశం అభివృద్ధి సాధిస్తుందన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధనలో బ్రహ్మకుమారీలు కూడా ముఖ్యమైన పాత్ర పోషించాలని సూచించారు. అంతేకాకుండా, బ్రహ్మకుమారీ గురువులు జానకీ దీదీ, దాది హృదయ మోహినితో తనకు ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమని మోదీ గుర్తుచేశారు.
Read Also: TG Weather: నేడు పలు జిల్లాల్లోవర్షాలు పడే అవకాశం
నక్సలిజం అంతమొందే దిశగా భారత్ – అభివృద్ధి మార్గంలో ఛత్తీస్‌గఢ్

దేశం నక్సలిజం, మావోయిజం వంటి విఘాతం నుంచి బయటపడుతోందని ప్రధాని మోదీ(Prime Minister Modi) అన్నారు. దేశ వారసత్వం, ఆధునిక అభివృద్ధి కలిసినపుడే సుస్థిర ప్రగతి సాధ్యమని తెలిపారు. నవ రాయ్‌పూర్‌లో రూ.324 కోట్లతో నిర్మించిన కొత్త అసెంబ్లీ భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే అసెంబ్లీ ఆవరణలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
బాబాసాహెబ్ అంబేడ్కర్ నాయకత్వంలో రాజ్యాంగ రూపకల్పనలో ఛత్తీస్‌గఢ్ నాయకులు కీలక పాత్ర పోషించారని మోదీ గుర్తు చేశారు. ఒకప్పుడు నక్సల్స్ ప్రభావం ఉన్న ప్రాంతాలు ఇప్పుడు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని తెలిపారు.
25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ ప్రాజెక్టులు
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh Visit) రాష్ట్రం 25వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రాయ్‌పూర్‌లో రూ.14,260 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించి, శంకుస్థాపనలు చేశారు. అనంతరం శ్రీ సత్య సాయి సంజీవని ఆస్పత్రిలో గుండె శస్త్రచికిత్సలు చేయించుకున్న 2,500 మంది చిన్నారులను కలుసుకున్నారు. ఈ పిల్లలతో మాట్లాడుతూ “గిఫ్ట్ ఆఫ్ లైఫ్” కార్యక్రమం ద్వారా వారికి కొత్త జీవం లభించడం దేశానికి గర్వకారణమని పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: