हिन्दी | Epaper

Chhattisgarh: కొడుకు మరణం తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య

Saritha
Chhattisgarh: కొడుకు మరణం తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య

Chhattisgarh: కన్నబిడ్డ మరణిస్తే ఆ తల్లిదండ్రుల గుండెల్లో చెలరేగే మంటను కాలం కూడా ఆపలేదు. కుమారుడు మరణించి ఏడాది గడిచినా కొడుకు జ్ఞాపకాలు వారిని నిలువనీయలేదు. జంజ్‌గిర్-చంపా జిల్లాలోని దార్దెయ్ గ్రామానికి చెందిన 48 ఏళ్ల కృష్ణ పటేల్ వృత్తిరీత్యా మేస్త్రీ. ఆయన భార్య 47 ఏళ్ల రమా బాయి గృహిణి. వీరికి 21 ఏళ్ల కుమారుడు ఆదిత్య పటేల్ ఉండేవాడు. 2024లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం (Road accident) ఈ కుటుంబంలో చీకటి నింపింది. అప్పటి నుంచి ఆ దంపతులు జీవచ్ఛవాల్లా మారారు. కొడుకు చనిపోయిన ఏడాది తర్వాత ఆ బాధను ఇక భరించలేమని భావించిన దంపతులు.. ఆదివారం అర్ధరాత్రి తమ ఇంటి ఆవరణలోని వేప చెట్టుకు ఉరివేసుకున్నారు.

Read Also: Maharashtra: NCP జాతీయ అధ్యక్షురాలిగా సునేత్రా పవార్ బాధ్యతలు!

Chhattisgarh: కొడుకు మరణం తట్టుకోలేక తల్లిదండ్రుల ఆత్మహత్య
Chhattisgarh: Parents commit suicide after not being able to bear the death of their son

కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్

చనిపోవడానికి ముందు కృష్ణ పటేల్ రాసిన నాలుగు పేజీల లేఖలో ప్రతీ అక్షరం కన్నీళ్లు తెప్పిస్తోంది. ఆదిత్య మా జీవిత పునాది. మా సర్వస్వం. దేవుడు మాకు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఒక రోజు ఆలయ పని కోసం వెళ్లమని నేనే వాడిని బలవంతం చేశాను. ‘దేవుడి పని కదా వెళ్లు’ అని నేను పంపడమే నా జీవితంలో నేను చేసిన అతిపెద్ద తప్పు. వాడు శాశ్వతంగా నన్ను విడిచి వెళ్లిపోయాడు. నేను శ్వాస తీసుకుంటున్నాను కానీ జీవించడం లేదు అంటూ లేఖలో పేర్కొన్నారు. ఆత్మహత్యకు ముందు దంపతులు వీడియోలో తమ లాయర్‌ను ఉద్దేశించి, ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులు కుటుంబ సభ్యులకు కుల్భరా పటేల్, జల్భరా పటేల్‌లకు అందించమని కోరారు. మేము ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం. శివునిలో ఐక్యమవుతున్నాం. మా చావుకు ఎవరూ బాధ్యులు కారు. మమ్మల్ని సంతోషంగా పంపించండి అని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

కుమార్తెను చంపిన తల్లి..ప్రియుడిపై నేరం నెట్టేందుకు యత్నం

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

పెళ్లి చేసుకుని మోసం.. భర్త నపుంసకుడని నవవధువు ఫిర్యాదు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

భార్యను చంపిన భారతీయుడి కోసం ఎఫ్‌బీఐ వేట: రూ. 9 కోట్ల రివార్డు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

ఆ తల్లికి ఎంత కష్టం.. ఆస్తి లాక్కొని అన్నం పెట్టకుండా వేధిస్తున్న కొడుకులు

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది అరెస్ట్

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

ప్రియురాలు పెళ్లికి ఒప్పుకోలేదనీ యువకుడు ఆత్మహత్య

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

కస్టమర్ ముక్కు పగులగొట్టిన బ్లింకిట్ డెలివరీ బాయ్.. ఎందుకంటే?

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్
0:52

హైదరాబాద్ లో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముఠా అరెస్ట్

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

బరితెగించిన కామాంధులు.. లిఫ్ట్ అడిగిన మహిళపై అత్యాచారం!

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

సునీతా రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

23 రోజుల పోరాటం.. మూడేళ్ల చిన్నారి కన్నుమూత

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం
1:01

ఘోర బస్సు ప్రమాదం: ఆరుగురు సజీవదహనం

📢 For Advertisement Booking: 98481 12870