ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. నక్సల్ ప్రభావిత పాంతంలో విధులు నిర్వహిస్తున్న డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) తోమేష్ వర్మపై కత్తితో దారుణంగా దాడి(Chhattisgarh) జరిగింది. దుర్గ్ జిల్లా నుంచి 350 కిలోమీటర్లు ప్రయాణించిన దుండగులు డీఎస్పీని ట్రాక్ చేసి, అతని కారులోకి ప్రవేశించి దాడికి తెగబడ్డారు.
Read also: Bangladesh: ‘హదీ’ హత్యపై గర్ల్ ఫ్రెండ్ కు షేర్ చేసిన నిందితుడు

పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి
డీఎస్పీ వర్మ ఆ సమయంలో అధికారిక పనితీరు కోసం దంతేవాడ సెషన్స్ కోర్టుకు వెళ్లారని పోలీసులు వెల్లడించారు. (Chhattisgarh) దుర్గ్ జిల్లాకు చెందిన రామశంకర్ సాహు, రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రజనీషా వర్మ తదితరులు డీఎస్పీ కదలికలను గమనించి, కొద్దిసేపటి తర్వాత, ఒక మహిళ కత్తి తీసుకుని డీఎస్పీని బెదిరించి అతని కారులోకి ఎక్కించిందని పోలీసులు తెలిపారు. డీఎస్పీ వర్మకు మెడ, ముఖం, తలపై తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. అయితే అతని పరిస్థితి స్థిరంగా ఉందని తెలిపారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: