Chennai weather today : దిత్వా తుపాను ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తుండటంతో భారత వాతావరణ శాఖ (IMD) పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. చెన్నై, కడలూరు, విల్లుపురం, కాంచీపురం జిల్లాల్లో ఆదివారం ఉదయం 7 గంటల వరకు భారీ వర్షాలు కొనసాగనున్నట్లు తెలిపింది.
శ్రీలంకలో ఇప్పటికే 123 మంది మృతి చెందిన ఈ తుపాను కారణంగా తీవ్ర నష్టం వాటిల్లిన ప్రాంతాలను ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ శనివారం పరిశీలించారు.
Read also: Garima Agrawal: సిరిసిల్లలో దివ్యాంగుల మహోత్సవం
తుపాను ప్రభావంతో చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయంలో మొత్తం 47 విమానాలను రద్దు చేశారు. ఇందులో 36 దేశీయ విమానాలు, 11 అంతర్జాతీయ విమానాలు ఉన్నాయి. తుపాను మరింత బలపడితే మరిన్ని విమానాలు రద్దయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు. ప్రయాణికులు విమాన సంస్థలతో సంప్రదించి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించారు.
ఐఎండీ తెలిపిన వివరాల ప్రకారం, దిత్వా తుపాను (Chennai weather today) గత ఆరు గంటల్లో గంటకు 10 కిలోమీటర్ల వేగంతో ఉత్తర–వాయువ్య దిశగా కదులుతోంది. ఆదివారం ఉదయానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను సమీపించే అవకాశం ఉంది.
ప్రజల భద్రత దృష్ట్యా తమిళనాడు ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 6,000 సహాయక శిబిరాలను ఏర్పాటు చేసినట్లు రెవెన్యూ మరియు విపత్తు నిర్వహణ శాఖ మంత్రి కేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ తెలిపారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also :