हिन्दी | Epaper

Chennai: పెళ్లైన రోజే ప్రియుడితో ఉడాయించిన నవ వధువు

Anusha
Chennai: పెళ్లైన రోజే ప్రియుడితో ఉడాయించిన నవ వధువు

చెన్నై: ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ప్రేమతో, భద్రతతో నిండిన బంధంగా కాక.. దారుణాలకు దారి తీసే వేదికలుగా మారిపోతున్నాయి. ఓ వైపు కుటుంబ పెద్దల ఒత్తిడితో పెళ్లికి ఒప్పుకుంటున్న యువతులు, మరోవైపు ప్రేమలో ఉన్న వారి వెంట వెళ్లేందుకు ఏకంగా భర్తలను హత్య చేయించడానికి కూడా వెనుకాడడం లేదు. తమిళనాడు రాజధాని చెన్నైలోని మాధవరం ప్రాంతంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.పెళ్ళైన రోజు మధ్యాహ్నమే, కొత్త పెళ్ళికూతురు తన ప్రియుడితో కలిసి పారిపోయింది. మాధవరంలోని బర్మా కాలనీకి చెందిన విజయకుమార్ (Vijayakumar) అనే వ్యక్తికి, పెరంబూరులోని అంబేద్కర్ నగర్‌కు చెందిన అర్చనలకు శుక్రవారం బెసెంట్ నగర్ చర్చిలో ఉదయం ఆరు గంటలకు వివాహం జరిగింది.పెళ్ళి జరిగిన రోజు సాయంత్రం రిసెప్షన్ ఉంది. దీంతో అర్చన బ్యూటీ పార్లర్‌కి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. అటునుంచి ఆమె తన ప్రియుడి దగ్గరకు వెళ్లి పోయింది.

తమకు ముందే ఈ విషయం చెబితే ఇంత వరకు వచ్చేవాళ్లం

బ్యూటీ పార్లర్‌కు వెల్లిన అర్చ ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆమె అత్తింటి వారికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె కోసం వెతకడం మొదలుపెట్టారు.ఈ క్రమంలో వారికి అర్చన బ్యూటీ పార్లర్‌కి వెళ్లలేదని తెలిసింది. ఆమె తన ప్రియుడు కలైతో కలిసి పారిపోయిందని వెల్లడైంది. దీంతో అర్చన (Archana) తల్లి నాగవల్లి తిరువిగ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. దీంతో శుక్రవారం,సాయంత్రం అర్చన తిరువిగనగర్ పోలీస్ స్టేషన్‌కు వచ్చింది. ఆమె విజయకుమార్‌కు క్షమాపణ చెప్పింది. తాను ప్రేమించిన వాడితోనే కలిసి ఉంటానని తేల్చి చెప్పింది. తమకు ముందే ఈ విషయం చెబితే ఇంత వరకు వచ్చేవాళ్లం కాదు కదా అని పెళ్లి కొడుకు కుటుంబం ఆమెపై మండి పడింది. ఎంగేజ్‌మెంట్, పెళ్లికి అయిన ఖర్చు ఎవరు భరిస్తారని వారు ప్రశ్నించారు. అర్చన కుటుంబ సభ్యులు పెళ్లి ఖర్చులకు పరిహారం ఇస్తామని ఒప్పుకున్నారు.

Chennai: పెళ్లైన రోజే ప్రియుడితో ఉడాయించిన నవ వధువు
Chennai: పెళ్లైన రోజే ప్రియుడితో ఉడాయించిన నవ వధువు

వరికి హానీ చేయకుండా తన జీవితం తాను చూసుకుంది

ఈ విషయం తెలుసుకున్న స్థానికులు, నెటిజనులు నువ్వు అదృష్టవంతుడి బ్రదర్, భార్య, ప్రియుడి చేతిలో హత్యకు గురికాకుండా తప్పించుకున్నావు. ఈ అమ్మాయి కాస్త మంచిది. ఎవరికి హానీ చేయకుండా తన జీవితం తాను చూసుకుంది అని కామెంట్ చేస్తున్నారు. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియా (Social media) లో వైరల్ అవుతోంది.ఈ సంఘటన ఆధునిక కాలంలో పెళ్లిళ్లలో వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రేమ సంబంధాల ప్రాముఖ్యత, పెద్దల ఒత్తిడి కారణంగా జరిగే పెళ్లిళ్లలో భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం వంటి అంశాలపై చర్చకు దారి తీస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Madrasa Teacher: మదరసా టీచర్‌ ఘాతుకం: మూడేళ్లుగా యువతిని బంధించి లైంగిక దాడులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

📢 For Advertisement Booking: 98481 12870