తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ జిల్లా సత్యమంగళం పులుల(Cheetah) సంరక్షణ కేంద్రం పరిధిలోని దట్టమైన అడవులు అనేక అడవి జంతువులకు ఆవాసంగా ఉన్నాయి. ఇక్కడ ఏనుగులు, చిరుతపులులు, ఎలుగుబంట్లు, అడవి దున్నలు వంటి జంతువులు విస్తారంగా నివసిస్తాయి. ఈ జంతువులు కొన్నిసార్లు రాత్రి వేళల్లో అడవిని దాటి ఘాట్ రోడ్లపైకి వస్తుండటంతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఓ చిరుతపులి ఘాట్ రోడ్డుకు సమీపంలోని గుంతలో దాక్కుని ఉండడం డ్రైవర్లను కలవరపెట్టింది.
Read Also: Health: రేబిస్ వ్యాధి లక్షణాలు ..తెసుకోవాల్సిన జాగ్రత్తలు
దిండిగల్–మైసూర్ జాతీయ రహదారి
దిండిగల్–మైసూర్ జాతీయ రహదారి ఈ అడవుల మధ్యుగా వెళ్తుంది. ఈ మార్గం దాటేటప్పుడు క్రూరమృగాలు తరచూ రోడ్డుపైకి వస్తుంటాయి. కొన్ని వాహనాల ఢీకొనడంతో మృతి చెందుతుంటే, మరికొన్ని జంతువులు సురక్షితంగా అడవిలోకి తిరిగి వెళ్లిపోతాయి. కొన్ని సందర్భాల్లో వాహనదారులపై దాడి చేసేందుకు కూడా ప్రయత్నించిన ఘటనలు ఉన్నాయి.
తాజాగా పన్నారి అమ్మన్ ఆలయం నుండి తింబం ఘాట్ రోడ్ వైపు వెళ్తున్న మార్గంలో ఒక చిరుతపులి గుంతలో మాటు వేసి కాపు కాస్తూ కనిపించింది. ఆ దృశ్యాన్ని గమనించిన వాహనదారులు తమ మొబైల్ ఫోన్లలో వీడియో తీయడానికి ప్రయత్నించగా, శబ్దం విని ఉలిక్కిపడిన చిరుత వెంటనే బయటకు వచ్చి అడవిలోకి పారిపోయింది. ఈ సంఘటనను రికార్డ్ చేసిన వ్యక్తి సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయగా, అది క్షణాల్లోనే వైరల్ అయింది.
ఈ ఘటనపై స్పందించిన అటవీశాఖ అధికారులు, తింబం–మైసూర్ రహదారిపై అడవి జంతువుల సంచారం ఎక్కువగా ఉండటంతో డ్రైవర్లు రాత్రి వేళల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: