हिन्दी | Epaper
సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం సోషల్ మీడియా రారాజు మోదీ–కార్నీ భేటీ కేపీ ఉన్నికృష్ణన్‌ కన్నుమూత భారత ఎగుమతులపై భారీ ఎఫెక్ట్ ముడి చమురు ధర యూఏఈలోని భారతీయుల తరలింపు ఖమేనీ మృతి ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Water metro: దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!

Vanipushpa
Water metro: దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!

మన దేశంలో రోజురోజుకీ జనాభాతో పాటు సిటీల్లో ట్రాఫిక్ కష్టాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. బస్సుల్లో, మెట్రో రైళ్లలో వెళ్దామన్నా రద్దీ తప్పడం లేదు. కేవలం మెట్రో నగరాల్లోనే కాదు. దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థల్లో చాలా ఇబ్బందులున్నాయి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక సూపర్ ఐడియాతో ముందుకొచ్చింది. అదే వాటర్ మెట్రో (Water Metro). అవును, మీరు విన్నది నిజమే! ఇకపై రోడ్ల మీదే కాదు.. నదులు, కాలువలు, సరస్సుల మీద కూడా మెట్రో ప్రయాణం సాధ్యం కాబోతోంది. దీని కోసం కేంద్రం ఏకంగా రూ. 9,280 కోట్లతో ఒక భారీ పథకాన్ని సిద్ధం చేస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. ఏంటి ఈ వాటర్ మెట్రో కథ? సాధారణంగా మనం పడవలు అంటే కేవలం సరదా కోసం ఎక్కేవి అనుకుంటాం. కానీ, ఈ వాటర్ మెట్రో అలా కాదు.

Read Also: SpaceX Moon Plan : చంద్రుడిపై మానవ నగరమా? ఎలన్ మస్క్ షాకింగ్ ప్లాన్!

Water metro: దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!
Water metro: దేశవ్యాప్తంగా వాటర్ మెట్రోలు ఏర్పాటుకు కేంద్రం భారీ ప్లాన్!

కేరళలోని కొచ్చిలో ఈ వాటర్ మెట్రో సక్సెస్

ఇది ఒక పక్కా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్. అంటే మనం ఆఫీసులకు, పనులకు వెళ్లడానికి సిటీ సెంటర్ల నుంచి చుట్టుపక్కల ప్రాంతాలకు నీటి మార్గం ద్వారా ప్రయాణించవచ్చు. ఇప్పటికే కేరళలోని కొచ్చిలో ఈ వాటర్ మెట్రో సక్సెస్ అయింది. అదే మోడల్‌ ను ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేయాలని కేంద్ర ఓడరేవుల మరియు నౌకాయాన మంత్రిత్వ శాఖ భావిస్తోంది. Also Read అమరావతి క్వాంటం వ్యాలీ.. టెక్నాలజీ రంగంలో సరికొత్త విప్లవం..పూర్తి వివరాలు ఇవే.. 18 నగరాల్లో కసరత్తు కేంద్రం ఇప్పటికే 18 నగరాలను ఎంపిక చేసి.. అక్కడ ఈ ప్రాజెక్టు ఎంతవరకు సాధ్యమవుతుందో తెలుసుకోవడానికి అధ్యయనాలు కూడా మొదలుపెట్టింది. ఒక్కో ప్రాజెక్టుకు సుమారు రూ. 800 కోట్ల నుండి రూ. 1,300 కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా. ఈ మొత్తం ప్రాజెక్టులో 50 శాతం ఖర్చును కేంద్రం భరిస్తే మిగిలిన 50 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సి ఉంటుంది. 2026 ఏప్రిల్ నుండి 10 ఏళ్ల పాటు ఈ పథకం కొనసాగనుంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ పథకంలో భాగంగా వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్, పాట్నా, కోల్‌కతా, గౌహతి వంటి నగరాలను ఎంపిక చేశారు.

కొల్లాం, ముంబై, గోవా, చెన్నై, అమరావతి వాటర్ మెట్రో సేవలు

దక్షిణ భారత దేశం నుండి ఇప్పటికే విజయవంతమైన కొచ్చితో పాటు మంగళూరు, కొల్లాం, ముంబై, గోవా, చెన్నై, అమరావతి వంటి ప్రాంతాల్లో కూడా ఈ వాటర్ మెట్రో సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నారు. పర్యావరణానికి ఎంతో మేలు ఈ వాటర్ మెట్రోలో వాడే బోట్లు మామూలు ఇంజిన్లతో నడిచేవి కావు. ఇవి పూర్తిగా ఎలక్ట్రిక్ లేదా హైబ్రిడ్ పద్ధతిలో నడిచే పర్యావరణ హితమైన బోట్లు. వీటి వల్ల గాలి కాలుష్యం ఉండదు, శబ్దం కూడా రాదు. రోడ్ల మీద రద్దీ తగ్గడమే కాకుండా, పెట్రోల్, డీజిల్ వినియోగం కూడా తగ్గుతుంది. దీనివల్ల మన పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

లైవ్‌ అప్‌డేట్స్ : క్షణక్షణం ఉత్కంఠం.. ఇజ్రాయెల్-ఇరాన్-అమెరికా వార్ అప్‌డేట్‌

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

గల్ఫ్ విమానాల రాకపోకలతో ఊపిరిపీల్చుకుంటున్న ప్రయాణికులు

సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

సాంకేతికత జోడిస్తేనే రైతుకు మేలు..

సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి

సుస్థిర ఆర్థిక వృద్ధితో సత్వర ప్రగతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

ఇరాన్ దాడుల్లో ముగ్గురు భారతీయులు మృతి

మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్!

మరో 16 హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల తయారీకి గ్రీన్ సిగ్నల్!

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇస్లాంలో సున్నీ, షియా వర్గాల మధ్య తేడాలు

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్

ఇరాన్ వార్ దెబ్బకు వణుకుతున్న భారత ఐటీ సెక్టార్

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

ఆర్‌ఆర్‌బీ టెక్నీషియన్ అడ్మిట్ కార్డ్ 2026 విడుదల

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర ప్రమాదం: ఆరుగురు మృతి!

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

కోమ్ నుండి టెహ్రాన్‌కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

సోషల్ మీడియా రారాజు.. యూట్యూబ్‌లో 3 కోట్ల సబ్‌స్క్రైబర్ల రికార్డు!

📢 For Advertisement Booking: 98481 12870