పెన్షన్‌దారులకు ప్రయోజనం చేకూరేలా కేంద్ర ప్రభుత్వం(Central Government) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి నెలా పెన్షన్ అందుకునే వారందరికీ బ్యాంకులు తప్పనిసరిగా పెన్షన్ పేమెంట్(pension payment slips) స్లిప్‌లు పంపాలని ఆర్థికశాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కుటుంబ పెన్షన్ పొందుతున్నవారూ ఇందులో భాగమే.
Read also: అపార్ట్‌మెంట్ విషయంలో హైకోర్టు కీలక తీర్పు
తాజాగా అనేక మంది పెన్షన్‌దారులు స్లిప్‌లు అందకపోవడంపై ఫిర్యాదులు చేయడంతో, సెంట్రల్ పెన్షన్ అకౌంటింగ్ ఆఫీస్ ఈ ఆదేశాలను మళ్లీ బ్యాంకులకు గుర్తు చేసింది. స్లిప్‌లను ఇమెయిల్, SMS, వాట్సాప్ లేదా ఇతర డిజిటల్ మార్గాల్లో పంపాలని సూచించింది. అవసరమైతే పెన్షన్‌దారుల కాంటాక్ట్ వివరాలను బ్యాంకులు స్వయంగా సేకరించాలి.

పేమెంట్ స్లిప్‌లో –
1. నెలలో జమ అయిన పెన్షన్ మొత్తం
2. కోతలు, పన్నులు, బకాయిల వివరాలు
3. అడ్జస్ట్మెంట్‌ల సమాచారం
వివరంగా ఉండాలని ప్రభుత్వ (Central Government)ఆదేశాలు వెల్లడించాయి. ముఖ్యంగా, స్లిప్‌లు స్పష్టమైన మరియు సులభమైన భాషలో ఉండాలి, ఎవరైనా సులభంగా అర్థం చేసుకునేలా ముద్రించాలి అని ఆర్థికశాఖ తెలిపింది. ఈ చర్యతో పెన్షన్‌దారులు తమ ఆర్థిక లావాదేవీలను సులభంగా ప్లాన్ చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: