ప్రతి ఒక్కరికీ తమకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేది అతిపెద్ద కల. కానీ రోజురోజుకూ పెరుగుతున్న ధరలు, స్థలం ఖర్చుల వల్ల సామాన్యుడికి ఇది భారంగా మారుతోంది. ఈ కలను నిజం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం PM Awas Yojana (ప్రధాన మంత్రి ఆవాస్ యోజన) పథకాన్ని అమలు చేస్తోంది. పట్టణాల్లో నివసించే పేద, మధ్యతరగతి ప్రజలకు ఈ పథకం కింద భారీ ఆర్థిక సాయం అందుతుంది. అయితే తాజా నిబంధనల ప్రకారం ఈ పథకంలో కొన్ని కీలక మార్పులు వచ్చాయి.(PM Awas Yojana) PM Awas Yojana ఎప్పుడు ప్రారంభమైంది? కేంద్ర ప్రభుత్వం పట్టణ ప్రాంతాల కోసం ఈ పథకాన్ని ఏప్రిల్ 1, 2016న ప్రారంభించింది. దీని రెండో దశ అయిన PMAY-U 2.0 సెప్టెంబర్ 1, 2024న రోల్ అవుట్ అయింది. రాబోయే ఐదేళ్లలో నగరాల్లో నివసించే EWS, LIG, MIG కుటుంబాలకు శాశ్వత గృహాలను అందించడమే ఈ ఫేజ్ ముఖ్య ఉద్దేశ్యం.
Read Also: Budget2026: RDSS కోసం భారీ బడ్జెట్ పెంపు సన్నాహాలు

ఎవరికి ఎంత నగదు అందుతుంది?
ఈ పథకం కింద లబ్ధిదారులను వారి వార్షిక ఆదాయం ఆధారంగా మూడు వర్గాలుగా విభజించారు: EWS (ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు): వార్షిక ఆదాయం రూ. 3 లక్షల వరకు ఉండాలి. LIG (తక్కువ ఆదాయ వర్గాలు): వార్షిక ఆదాయం రూ. 6 లక్షల వరకు ఉండాలి. MIG (మధ్య ఆదాయ వర్గాలు): వార్షిక ఆదాయం రూ. 9 లక్షల వరకు ఉండాలి. ఆర్థిక సాయం వివరాలు ఇల్లు నిర్మించుకునే వారికి ప్రభుత్వం మొత్తం రూ. 2.5 లక్షల వరకు సహాయం అందిస్తుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 1 లక్ష వరకు ఇస్తాయి. అంతేకాకుండా హోమ్ లోన్ తీసుకునే వారికి రూ. 1.8 లక్షల వరకు వడ్డీ సబ్సిడీ కూడా లభిస్తుంది.
సొంత స్థలం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు
ఆగస్టు 31, 2024 కంటే ముందే సొంత స్థలం ఉన్నవారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ఆ తేదీ తర్వాత స్థలం కొన్నవారు లేదా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారు ఈ నిధులకు అర్హులు కారు. నివాస ప్రాంతం: మీ స్థలం ఖచ్చితంగా నివాస ప్రాంతంలోనే ఉండాలి. బయటి ప్రాంతాల్లో ఉన్న స్థలాలకు ఈ పథకం వర్తించదు. అర్హత సర్టిఫికేట్: నిధులు పొందేందుకు ‘ఎలిజిబిలిటీ బెనిఫిషియరీ సర్టిఫికేట్’ తప్పనిసరి. అధికారిక పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న తర్వాత, మున్సిపల్ అధికారులు ఫిజికల్ వెరిఫికేషన్ చేస్తారు. అంతా సవ్యంగా ఉంటేనే సర్టిఫికేట్ ఇచ్చి, నాలుగు విడతల్లో డబ్బులు జమ చేస్తారు. ఏయే డాక్యుమెంట్లు అవసరం? మీరు ఆగస్టు 31, 2024 కంటే ముందే అక్కడ నివసిస్తున్నారని నిరూపించేందుకు పాత కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు లేదా మున్సిపల్ ట్యాక్స్ రసీదులు చూపించాలి. పాత ఓటరు జాబితాలో మీ పేరు ఉన్నా అది ఆధారంగా పనిచేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: