భారతదేశంలో మెసేజింగ్ యాప్‌ల వినియోగం (Social Media) పై కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. డివైజ్‌లో సిమ్ కార్డు ఉంటేనే ఇలాంటి కమ్యూనికేషన్ యాప్ సర్వీసులు పనిచేసేలా చూడాలంటూ టెలికమ్యూనికేషన్స్ డిపార్టుమెంట్ సూచించింది. వాట్సాప్ , సిగ్నల్, స్నాప్ చాట్, టెలిగ్రామ్, షేర్ చాట్, జియో చాట్, అరట్టై, జోష్ వంటి కమ్యూనికేషన్ యాప్ (Social Media) లను కేంద్రం ఈ సూచనలు చేసింది. కేంద్రం కొత్తగా తీసుకువస్తున్న టెలికమ్యూనికేషన్ సైబర్ సెక్యూరిటీ సవరణ నిబంధనలు, 2025లో భాగంగా ఈ ఆదేశాలను డిపార్టుమెంట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ విభాగం జారీ చేసింది.
Read Also: Nerella Jyothi: మాజీ మావోయిస్టు నాయకురాలు సర్పంచ్ పదవికి పోటీ
కొత్త నిబంధనల ప్రకారం ఈ యాప్‌లు తమ సేవలను వినియోగదారుడి సిమ్ కార్డ్‌తో నిరంతరం అనుసంధానమై ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా కంప్యూటర్ బ్రౌజర్ల ద్వారా లాగిన్ అయిన వారిని ప్రతి 6 గంటలకు ఒకసారి ఆటోమేటిక్‌గా లాగౌట్ చేయాలని, మళ్లీ క్యూఆర్ కోడ్ ద్వారా ధ్రువీకరించుకున్న తర్వాతే లాగిన్ అవ్వనివ్వాలని టెలికాం శాఖ (డాట్) స్పష్టం చేసింది.
దీనివల్ల ప్రతీ సెషన్ యాక్టివ్‌గా ఉన్న సిమ్‌తో ముడిపడి ఉంటుందని, నేరగాళ్లు రిమోట్‌గా యాప్‌లను దుర్వినియోగం చేయడం కష్టమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ప్రస్తుతం యాప్‌ను ఇన్‌స్టాల్ చేసే సమయంలో ఒక్కసారి మొబైల్ నంబర్‌ను ధ్రువీకరించుకుంటే చాలు.

విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారు
ఆ తర్వాత సిమ్ కార్డ్‌ను తీసేసినా లేదా డీయాక్టివేట్ చేసినా యాప్ పనిచేస్తూనే ఉంటుంది. ఈ లొసుగును అడ్డం పెట్టుకుని సైబర్ నేరగాళ్లు, ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు మోసాలకు పాల్పడుతున్నారని, వారిని గుర్తించడం కష్టంగా మారుతోందని ప్రభుత్వం చెబుతోంది. సిమ్ బైండింగ్ ద్వారా యూజర్,
వారి నంబర్, డివైజ్ మధ్య సంబంధాన్ని గుర్తించడం సులభమవుతుందని సెల్యులార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (COAI) అభిప్రాయపడినట్టు ‘మీడియానామా’ తన కథనంలో పేర్కొంది. ఇప్పటికే బ్యాంకింగ్, యూపీఐ యాప్‌లలో ఇలాంటి భద్రతా ప్రమాణాలు అమలులో ఉన్నాయి.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: