న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం పద్మ అవార్డులు 2025 గ్రహీతల జాబితాను కేంద్రం ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో పద్మ అవార్డులు మూడు విభాగాలలో ప్రదానం చేయబడతాయి. పద్మవిభూషణ్, పద్మ భూషణ్ , పద్మశ్రీ. కళ, సామాజిక సేవ, ప్రజా వ్యవహారాలు, సైన్స్, ఇంజినీరింగ్, వాణిజ్యం, పరిశ్రమలు, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు మరియు పౌర సేవ వంటి విభిన్న రంగాలలో అత్యుత్తమ ప్రతిభను ఈ అవార్డు గుర్తిస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా భారత రాష్ట్రపతి వీటిని సంప్రదాయబద్ధంగా ప్రకటిస్తారు.
ఈ ఏడాది 5 మందికి పద్మవిభూషణ్, 17 మందికి పద్మభూషణ్, 110 మందికి పద్మశ్రీ అవార్డులు అందజేయనున్నారు. నటి వైజయంతి మాల, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పద్మవిభూషణ్‌కు ఎంపిక కాగా.. మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్‌లను పద్మభూషణ్ అవార్డుతో సత్కరించనున్నారు.

పద్మశ్రీ అవార్డులు..
.నరేన్ గురుంగ్ (జానపద గాయకుడు) – నేపాల్
.హరిమన్ శర్మ (యాపిల్ సాగుదారు) – హిమాచల్ ప్రదేశ్
.జుమ్డే యోమ్‌గామ్ గామ్లిన్ (సామాజిక కార్యకర్త)- అరుణాచల్ ప్రదేశ్
.విలాస్ దాంగ్రే (హౌమియోపతి వైద్యుడు) – మహారాష్ట్ర
.వెంకప్ప అంబానీ సుగటేకర్ (జానపద గాయకుడు) – కర్ణాటక
.జోనస్ మాశెట్టి (వేదాంత గురు) బ్రెజిల్
.హర్వీందర్‌సింగ్ (పారాలింపియన్ గోల్డ్‌మెడల్ విన్నర్) హరియాణా
.భీమ్ సింగ్ భవేష్ (సోషల్‌వర్క్) బిహార్
.పి.దక్షిణా మూర్తి (డోలు విద్వాంసుడు) పుదుచ్చేరి
.ఎల్.హంగ్‌థింగ్ (వ్యవసాయం-పండ్లు) నాగాలాండ్
.బేరు సింగ్ చౌహాన్ (జానపద గాయకుడు) – మధ్యప్రదేశ్
.షేఖా ఎ.జె. అల్ సబాహ్ (యోగా)- కువైట్
ఈ సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీతలలో సమాజానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చిన వ్యక్తులు ఉన్నారు. ఈ జాబితాలో దేశంలోని మొదటి మహిళా మహవత్ పార్వతి బారువా , సామాజిక కార్యకర్త జగేశ్వర్ యాదవ్ వంటి పేర్లు ఉన్నాయి. వీరిద్దరూ అస్సాంకు చెందినవారు. ఇది కాకుండా చామీ ముర్ము, సోమన్న, సర్వేశ్వర్, సంగం సహా చాలా మంది ప్రతిభావంతులు కూడా ఉన్నారు. పద్మ అవార్డు గ్రహీతల్లో 30 మంది మహిళలు ఉన్నారు. అంతే కాకుండా.. ఫారినర్/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ కేటగిరీకి చెందిన 8 మందిని కూడా చేర్చారు. 9 మందికి మరణానంతరం ప్రదానం చేస్తున్నారు.