దేశంలో మొబైల్ భద్రతను బలపర్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే 15 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్య IMEI (International Mobile Equipment Identity) ను మార్చడం లేదా ట్యాంపర్ చేయడాన్ని ఇకపై తీవ్రమైన నేరంగా పరిగణించనుంది. ఈ మేరకు టెలికాం శాఖ (DoT) సోమవారం అధికారికంగా నిబంధనలను కఠినతరం చేసింది.
Read Also: Red Fort blast : ఎర్రకోట పేలుడు మూడు సంవత్సరాలుగా సాగుతున్న టెరర్ ప్లాన్
గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష,
ఈ నేరానికి పాల్పడిన వారికి గరిష్ఠంగా మూడేళ్ల జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించనున్నట్లు హెచ్చరించింది.ఈ మేరకు మొబైల్ ఫోన్ల తయారీదారులు, బ్రాండ్ యజమానులు, దిగుమతిదారులు, విక్రయదారులందరికీ టెలికాం శాఖ ఒక ప్రత్యేక అడ్వైజరీ జారీ చేసింది.

కొత్తగా అమల్లోకి వచ్చిన “టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023” ప్రకారం ఈ కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్లు తెలిపింది. ప్రతి ఒక్కరూ చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది.”టెలికమ్యూనికేషన్స్ చట్టం, 2023 ప్రకారం.. IMEI నంబర్లు (IMEI Number) సహా ఇతర టెలికాం ఐడెంటిఫైయర్లను ట్యాంపరింగ్ చేస్తే కఠినమైన శిక్షలు ఉంటాయి.
చట్టాన్ని ఉల్లంఘించిన వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష, రూ. 50 లక్షల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయి” అని టెలికాం శాఖ తన ప్రకటనలో పేర్కొంది. దొంగిలించబడిన ఫోన్లను గుర్తించకుండా ఉండేందుకు IMEI నంబర్లను (IMEI Number) మార్చడం వంటి అక్రమ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: