జనగణన-2027ను(Census-2027) డిజిటల్ గా(Digital) చేపట్టనున్నట్లు కేంద్రం లోక్ సభ లో వెల్లడించింది. ‘మొబైల్ యాప్ ద్వారా డేటాను సేకరిస్తాం. ప్రజలు వెబ్ పోర్టల్ ద్వారా స్వయంగా వివరాలు అందించే అవకాశం కల్పిస్తాం. ప్రతి ఒక్కరి వివరాలను ప్రస్తుతం వారు నివసిస్తున్న చోటే సేకరిస్తాం. వారు జన్మించిన ప్రాంతం, గతంలో నివసించిన చోటు నుంచి కూడా డేటా తీసుకుంటాం. వలసలకు కారణాలు తెలుసుకుంటాం’ అని వివరించింది. జనగణన రెండు దశల్లో జరగనుంది.
Read also: భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అసిమ్ మునీర్

2026–27 జనగణన షెడ్యూల్ వివరాలు
2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య మొదటి దశ.. రాష్ట్రాలు,(Census-2027) కేంద్రపాలిత ప్రాంతాల సౌలభ్యాన్ని బట్టి 30 రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఇక రెండో దశ విషయానికి వస్తే.. 2027 మార్చి 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా తీసుకుని 2027 ఫిబ్రవరిలో పాపులేషన్ ఎన్యూమరేషన్ నిర్వహించనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: