ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ లో శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవ్వగా,తొలి గంటల్లోనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సహా పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.సాయంత్రం 6 గంటల వరకు జరగనున్న ఓటింగ్ లో 1.56 కోట్లమందికి పైగా ఢిల్లీ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు అధికార ఆమ్ ఆద్మీ పార్టీ,భాజపా,కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోతూ నెలకొంది.ఓటింగ్ నేపథ్యంలో ఎలాంటి ఆవాంచియా ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.౩౦వేళ మంది పోలీసులు,230 కంపెనీల పారామిలిటరీ బలగాలను మోహరించారు.
ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు వీరే….

దేశ ప్రధమ పౌరులు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి ఎస్టేట్ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-.కాంగ్రెస్ ఎంపీ,లోకసభలోప్రతిపక్ష నేత రాహుల్గాంధీ నిర్మాణ్ భవన్ లో ఓటు వేశారు.
-విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్,ఆయన సతీమణి తుగ్లక్ క్రెసెంన్ట్లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి,ఆయన సతీమణి లక్ష్మి పూరి,ఇతర కుటుంబసభ్యులు ఆనంద్ నికేతన్ లో ఓటు వేశారు.
-దివంగత నేత సుష్మాస్వరాజ్ కుమార్తె,భాజపా ఎంపీ బాన్సురి స్వరాజ్ జనపథ్ లోని పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
-భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్విపేది,నేవీ చీఫ్అడ్మిరల్ దినేష్ కే.త్రిపాఠి కే కామ్రాజ్ లేన్ లో ఓటు వేశారు.
-ఆఫ్ సీనియర్ నేత మనీష్ సిసోదియా,తన సతీమణి సీమాతో కలిసి న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు.
– ఢిల్లీ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా రాజ్ నివాస్ మార్గ్ లో,ముక్యమంత్రి అతిశీ కాల్కాజి లో ఓటు వేశారు.