జర్మనీకి చెందిన ప్రఖ్యాత లగ్జరీ కార్ల (Car prices) తయారీ సంస్థ మెర్సిడెస్-బెంజ్ (Mercedes-Benz) కస్టమర్లకు షాక్ ఇవ్వబోతోంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి కార్ల ధరలు (Car prices) పెంచనుంది. 1-2% మేర పెరుగుదల ఉంటుందని తెలిపింది. అయితే ఏ మోడల్ ధర ఎంత పెరుగుతుందనే విషయాన్ని చెప్పలేదు. యూరో స్థిరంగా రూ.100 మార్కుకు పైనే ఉంది. దీనివల్ల స్థానిక ఉత్పత్తి కోసం దిగుమతి చేసుకున్న విడిభాగాలు మొదలుకొని, పూర్తిగా నిర్మించిన యూనిట్ల వరకు అన్ని కార్యకలాపాలపైనా ప్రభావితం కనిపిస్తోందని మెర్సిడెస్- బెంజ్ ఇండియా ఎండీ,సీఈఓ సంతోష్ అయ్యర్ అన్నారు.
Read Also: Egg Prices: కోడి గుడ్ల ధరల కు రెక్కలు

కార్యకలాపాల నిర్వహణ కోసం కొంత పెంపు
పెరిగిన ఖర్చులను స్థానిక విడిభాగాలను కొనుగోలు చేయడం ద్వారా తగ్గించే ప్రయత్నం చేస్తున్నప్పటికీ, కార్యకలాపాల నిర్వహణ కోసం కొంత పెంపు తప్పనిసరి. అంతేకాకుండా ద్రవ్యోల్బణ ఒత్తిడి, ఇన్పుట్ ఖర్చులు, కమొడిటీ ధరలు, పెరిగిన లాజిస్టిక్ ఖర్చులు కంపెనీ లాభాలపై ఒత్తిడి కలిగిస్తాయని, అందుకే ధరలను సర్దుబాటు చేస్తున్నట్టు కంపెనీ వివరణ ఇచ్చింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: