ఎట్టకేలకు పౌరసత్వం చట్టంలో కెనడా (Canada) కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పౌరసత్వ చట్టంలో సవరణకు ఉద్దేశించిన సీ-3 బిల్లుకు ఆమోదం లభించింది. త్వరలో ఇది చట్టంగా మారనుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే కెనడాలో ఉంటున్న వేలాదిమంది భారత సంతతి వారికి ఉపయోగకరంగా ఉంటుంది.
Read Also: KTR: జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కార్పొరేటర్ల పోరాటాన్ని కేటీఆర్ ప్రశంస

ఇప్పటికే ఆ దేశంలో చర్చనీయాంశంగా ఉన్న సెకండ్ జనరేషన్ కటాఫ్ లోని సమస్యలను కెనడా ప్రభుత్వం పరిష్కరించింది . గతంలో ఉన్న నిబంధనల ప్రకారం విదేశాల్లో జన్మించిన కెనడా వాసుల పిల్లలకు ఆటోమేటిక్ గా పౌరసత్వం వచ్చేది కాదు. ఇప్పుడు ఆ సమస్య తీరిపోనుంది.
సెకండ్ జనరేషన్ కటాఫ్ రూల్
కెనడా బయట జన్మించిన పిల్లలకు ఒకవేళ వారి పేరెంట్స్ కూడా బయటి దేశాల్లో జన్మిస్తే పౌరసత్వం వచ్చేది కాదు. ఈ రూల్ వల్ల నస్టపోయిన వారందరిని ‘లాస్ట్ కెనెడీయన్స్’గా పరిగణించేవారు. ఈ రూల్ ను వ్యతిరేకిస్తూ గత కొన్నేళ్లుగా ఉద్యమం జరుగుతోంది. ఇక ఈ నిబంధన రాజ్యాంగ వవిరుద్ధమని ఆ దేశ కోర్టు తేల్చి చెప్పింది.దీంతో కెనడా ప్రభుత్వం ఈ కొత్త బిల్లును సిద్ధం చేసింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: