हिन्दी | Epaper

Budget 2026: గత బడ్జెట్ లలో నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు ఇవే!

Anusha
Budget 2026: గత బడ్జెట్ లలో నిర్మలా సీతారామన్ ధరించిన చీరలు ఇవే!

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి ఏడాది పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున ఆమె ధరించే చీర ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది.

నిర్మలా సీతారామన్  తొలిసారి 2019 లో ఆర్థిక శాఖ మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో ఆమె ఏపీకి చెందిన మంగళగిరి చేనేత పట్టు చీరను ఎంచుకున్నారు. ఇది గులాబీ రంగులో ఉండి , అంచు బంగారు రంగులో ఉంటుంది. ఆ బడ్జెట్ సమయంలో ఇది చాలా ఆకర్షణగా నిలిచింది.
2019లో తొలిసారిగా ఆర్థిక మంత్రిగా బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా నిర్మలా సీతారామన్ మంగళగిరి గులాబీ రంగు చీర ధరించారు.
2020లో బడ్జెట్ ప్రవేశ పట్టే సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతా రామన్ పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించింది.
2020 బడ్జెట్ సందర్భంగా ఆమె పవిత్రతకు, శ్రేయస్సుకు సూచిక అయిన పసుపు రంగు చీరను ధరించింది.
2021లో మూడో సారి బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను ధరించింది. ఇది ఎరుపు రంగులో గ్రీన్, వైట్ కలర్ బోర్డర్‌తో ఉంటుంది.
2021లో నిర్మలమ్మ భూదాన్ పోచంపల్లి ఇక్కత్ పట్టు చీరను ధరించింది.
2022లో ఒడిశా రాష్ట్రానికి చెందిన బొంకాయ్ శైలి చీరను ధరించారు. ఇది బ్రౌన్ కలర్‌లో చాలా ఆకర్షణీయంగా ఉంది.
2022 బడ్జెట్ రోజున ఒడిశాకు చెందిన మెరూన్ రంగు చేనేత చీరను ఆమె ధరించారు.
2023లో 2023లో బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో నిర్మలా సీతారామన్, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ,చాలా ఆకర్షణీయమైన కర్ణాటక‌కు సంబంధించిన కసూతి ఎంబ్రాయిడరీ చీరను ధరించింది. ఎరుపు రంగులో ఉంటూ, నలుపు రంగు బోర్డర్‌తో ఉంది. చేతితో అల్లిన కసూతి వర్క్ చాలా ఆకర్షణీయంగా ఉంది.
2023లో నిర్మలమ్మ, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ,చాలా ఆకర్షణీయమైన కర్ణాటక‌కు సంబంధించిన కసూతి ఎంబ్రాయిడరీ చీరను ధరించింది.
2024లో మధ్యంతర బడ్జెట్ సమయంలో నిర్మలా సీతారామన్ పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీతో ఉన్న ఇండిగో బ్లూకలర్ సిల్క్ చీరను ధరించింది. ఇది ఆ బడ్జెట్ సమయంలో చాలా ఆకర్షణీయంగా నిలిచింది. ఇక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే సమయంలో తెలుపు రంగు గోల్డ్, గులాబీ రంగు బోర్డర్ ఉన్న చీరను ధరించింది.
2024లో మధ్యంతర బడ్జెట్ సందర్భంగా ఆమె పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంతా ఎంబ్రాయిడరీతో ఉన్న ఇండిగో బ్లూకలర్ సిల్క్ చీరను ధరించింది.
Budget 2026: These are the sarees worn by Nirmala Sitharaman in previous budgets!
2025 బడ్జెట్ రోజున నిర్మలా సీతారామన్ బీహార్‌కు చెందిన మధుబని కళా చిత్రాలతో అలంకరించిన క్రీమ్ కలర్ చీరను ధరించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870