భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన వ్యవసాయ రంగం లో, రాబోయే కేంద్ర బడ్జెట్ 2026 (Budget 2026) వ్యవసాయాన్ని కేవలం జీవనాధార రంగంగా కాకుండా లాభసాటి, సుస్థిర రంగంగా మార్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకురావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈసారి బడ్జెట్ ప్రధానంగా సంప్రదాయ సాగు విధానాల నుంచి సాంకేతికత ఆధారిత ‘స్మార్ట్ అగ్రికల్చర్’ వైపు మార్పును లక్ష్యంగా పెట్టుకుంటుందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.
Read Also: Kerala: షింజిత ముస్తాఫా పై కేసు నమోదు
మౌలిక సదుపాయాల లోపాన్ని తీర్చేందుకు ప్రణాళికలు
తాత్కాలిక సబ్సిడీలకు పరిమితమవకుండా ఉత్పాదకత, స్థిరత్వం, మార్కెట్ ఆధారిత వృద్ధి దిశగా వ్యవసాయాన్ని తీసుకెళ్లే విధాన నిర్ణయాలు ఈ బడ్జెట్ (Budget 2026)లో కనిపించవచ్చని అంచనా వేస్తున్నారు. గత దశాబ్దంలో వ్యవసాయానికి కేటాయింపులు గణనీయంగా పెరిగాయి. 2013-14లో రూ. 21,933 కోట్లుగా ఉన్న వ్యవసాయ బడ్జెట్.. ప్రస్తుతం రూ. 1.27 లక్షల కోట్లకు పైగా చేరింది. ఇది ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని ఆర్థిక వృద్ధికి కేంద్ర బిందువుగా చూస్తోందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.
క్లైమేట్-రెసిలియంట్ అగ్రికల్చర్ కీలకంగా మారనుంది. రైతుల నష్టాలకు ప్రధాన కారణంగా మారుతున్న మౌలిక సదుపాయాల లోపాన్ని తీర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. కోల్డ్ స్టోరేజ్‌లు, గిడ్డంగులు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేలా PPP మోడల్‌ను మరింత బలోపేతం చేయనున్నారు. పంట కోత తర్వాత నష్టం తగ్గి, రైతుకు గిట్టుబాటు ధర దక్కేలా రవాణా నెట్‌వర్క్‌ల ఆధునీకరణ కూడా బడ్జెట్‌లో కీలక అంశంగా ఉండనుంది.

రైతును రక్షించడమే లక్ష్యం
కరువు, వరదలను తట్టుకునే ఆధునిక విత్తనాల అభివృద్ధికి అదనపు నిధులు, డ్రిప్ ఇరిగేషన్, సూక్ష్మ సేద్యం వంటి నీటి సంరక్షణ పద్ధతులకు మరింత ప్రోత్సాహం, సేంద్రియ సాగు ద్వారా భూసారాన్ని కాపాడే విధానాలు బడ్జెట్‌లో చోటు దక్కే అవకాశముంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గిస్తూ రైతును రక్షించడమే లక్ష్యంగా ఈ నిర్ణయాలు ఉండనున్నాయి.
ఇకపై వరి, గోధుమలకే పరిమితం కాకుండా హార్టికల్చర్, ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాలు వంటి అధిక లాభాల పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నది ప్రభుత్వ ఆలోచన. తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం ఇచ్చే పంటలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ఎగుమతి ఆధారిత వ్యవసాయంపై శిక్షణ కార్యక్రమాలు కూడా బడ్జెట్‌లో కనిపించే అవకాశముంది. దీంతో రైతుల ఆదాయ వనరులు మరింత విస్తరించనున్నాయి.
రైతుకు టెక్నాలజీని చేతికందించే దిశగా కూడా బడ్జెట్-2026 కీలక అడుగులు వేయనుంది. మొబైల్ యాప్‌ల ద్వారా రియల్‌టైమ్ వాతావరణ సమాచారం, తెగుళ్ల హెచ్చరికలు, పంట ధరల అప్‌డేట్స్ అందించడం, e-NAM వంటి డిజిటల్ మార్కెట్‌లను మరింత బలోపేతం చేయడం ద్వారా దళారీ వ్యవస్థకు చెక్ పెట్టే ప్రయత్నాలు జరుగనున్నాయి. రుణాలు, బీమా, పంట అంచనాలు అన్నీ డిజిటల్‌గా సులభతరం చేయడం ద్వారా రైతు సమయాన్ని, ఖర్చును తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: