బీఎస్ఎన్ఎల్(BSNL) ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తీసుకొస్తుంది. ఈ క్రమంలో తాజాగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన చవకైన రీఛార్జ్ ప్లాన్‌ను ప్రకటించింది. నవంబర్ 14న ప్రవేశపెట్టిన ఈ ప్లాన్ డిసెంబర్ 13 వరకు అందుబాటులో ఉండనుంది. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థగా బీఎస్ఎన్ఎల్(Bharat Sanchar Nigam Limited), ప్రైవేట్ కంపెనీలకంటే తక్కువ ధరకు డేటా, కాలింగ్ సేవలు అందిస్తూ ఇప్పటికే మంచి సబ్‌స్క్రైబర్ బేస్‌ని సంపాదించుకుంది.
పండుగలు లేదా ప్రత్యేక రోజుల సందర్భంలో మరింత ఆకట్టుకునే ఆఫర్లను విడుదల చేస్తోంది. తాజాగా 5G సేవలు ప్రారంభించిన తర్వాత బీఎస్ఎన్ఎల్‌కు చేరే కస్టమర్ల సంఖ్య పెరుగుతూనే ఉంది.
Read Also: Upasana: తెలంగాణలో అపోలో గ్రూప్ భారీ పెట్టుబడి: ఉపాసన

డిసెంబర్ 13 వరకు BSNL స్పెషల్ ఆఫర్
చిల్డ్రన్స్ డే సందర్భంగా బీఎస్ఎన్ఎల్ విద్యార్థులకు ప్రత్యేకంగా రూ.251 ప్లాన్‌ను ప్రకటించింది. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న ఈ ప్లాన్‌లో 100GB హై స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్ 14 నవంబర్ నుంచి 13 డిసెంబర్ మధ్య రీఛార్జ్ చేసుకునే వారికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు అటెండ్ అయ్యే విద్యార్థులు, రీసెర్చ్ పనిచేసేవారు, ప్రాజెక్టుల కోసం ఎక్కువ డేటా అవసరం ఉన్న వారికి ఈ ఆఫర్ ఎంతో ఉపయోగపడుతుందని బీఎస్ఎన్ఎల్ పేర్కొంది. ఈ ప్లాన్‌లో 4G నెట్‌వర్క్ సేవ మాత్రమే లభ్యం.
రూ.251 ధరగల ఈ ప్లాన్‌ను బీఎస్ఎన్ఎల్ సెల్ఫ్ కేర్ యాప్, సమీప కస్టమర్ సర్వీస్ సెంటర్, ఫ్రాంచైజీ లేదా పాయింట్ ఆఫ్ సేల్ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు. మొత్తం 28 రోజుల వ్యాలిడిటీ ప్రకారం రోజుకు కేవలం రూ.9 మాత్రమే ఖర్చవుతుంది. విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ ప్యాక్ బీఎస్ఎన్ఎల్ నుంచి మంచి స్పందనను పొందుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: