ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్(BSNL) మరోసారి తన ప్రీపెయిడ్ వినియోగదారులను నిరుత్సాహపరిచే నిర్ణయం తీసుకుంది. ఎలాంటి ముందస్తు సమాచారంలేకుండా, సంస్థ తన ప్రసిద్ధ ₹107 ప్రీపెయిడ్ ప్లాన్‌లో మార్పులు చేసి వ్యాలిడిటీని తగ్గించింది. ఈ చర్యపై కస్టమర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
Read also : East Godavari crime: కువైట్ నుంచి తిరిగొచ్చి పిల్లలను చంపి.. ఆపై తండ్రి ఆత్మహత్య

ఇంతకుముందు 28 రోజుల వ్యాలిడిటీ అందించిన ఈ ప్లాన్, తాజా సవరణలతో కేవలం 22 రోజులకు కుదించారు. ధర మాత్రం అలాగే ఉండటంతో, వినియోగదారులపై పరోక్షంగా అదనపు భారం పడినట్లైంది. కొన్నేళ్ల క్రితం ఈ ప్లాన్ 35 రోజులపాటు అమలులో ఉండేది. వ్యాలిడిటీని వరుసగా తగ్గిస్తూ వచ్చేందంతో బీఎస్ఎన్ఎల్ కూడా ప్రైవేట్ కంపెనీల విధానాలను అనుసరిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్లాన్ ఖర్చు పెంచకపోయినా, వ్యాలిడిటీ తగ్గించడం కూడా ఒక విధంగా దరలు పెంచినట్టే అవుతుందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. సుమారు 20%కి పైగా ధర పెంపుతో సమానమైన ప్రభావం ఈ మార్పుతో వస్తుందని వారు భావిస్తున్నారు.
ఈ నిర్ణయం వెలుగులోకి రావడంతో సోషల్ మీడియాలో వినియోగదారులు తీవ్రంగా స్పందిస్తున్నారు. పాత వ్యాలిడిటీని తిరిగి అమలు చేయాలని బీఎస్ఎన్ఎల్‌ను కోరుతూ హ్యాష్‌ట్యాగ్‌లతో అనేక పోస్టులు చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :