Breaking News: ఫరీదాబాద్ ఉగ్రవాద మాడ్యూల్ కేసు విచారణలో కీలక మలుపు తిరిగింది. దర్యాప్తు సంస్థల విచారణలో అరెస్టయిన ప్రధాన నిందితులు డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనాయీ మరియు ఉమర్ షాకింగ్ వివరాలు బయటపెట్టారు.
వారిద్దరూ విచారణలో చేసిన అంగీకార ప్రకారం, 2026 జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా, అలాగే దీపావళి పండుగల సమయంలో ఢిల్లీలో భారీ పేలుళ్లను జరపాలని ప్రణాళిక రచించినట్లు వెల్లడించారు. దేశంలో భయాందోళన వాతావరణం సృష్టించడం తమ ప్రధాన ఉద్దేశమని కూడా అంగీకరించారు.
Read Also: Bhagyashri Borse : ఈసారైనా భాగ్యశ్రీ కోరిక తీరుతుందా..?

రహస్య ప్రదేశంలో ట్రయల్ బ్లాస్ట్
Breaking News: అంతేకాకుండా, తమ ముఠా సభ్యులు పేలుడు పదార్థాలు, ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్, మందుగుండు సామగ్రి వంటి ఆయుధాలను వివిధ ప్రాంతాల్లో నిల్వ చేసినట్లు కూడా విచారణలో బయటపెట్టారు. దర్యాప్తు అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని ఒక రహస్య ప్రదేశంలో ట్రయల్ బ్లాస్ట్ కూడా నిర్వహించినట్లు నిందితులు అంగీకరించారు.
ఇంకా, గత ఆరు నెలల్లో అనేకసార్లు ఎర్రకోట ప్రాంతంలో రెక్కీ చేసినట్లు కూడా వెల్లడించారు. ఈ వివరాలన్నీ వెలుగులోకి రావడంతో, దర్యాప్తు సంస్థలు కేసు దిశను మరింత గంభీరంగా తీసుకున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: