Breaking news: ఇండిగో ఎయిర్‌లైన్స్ విమాన రద్దుల నేపథ్యంలో ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 5 నుంచి 15 మధ్యలో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికుల్లో ఎవరి విమానాలు రద్దు అయ్యినా లేదా సమయ మార్పు జరిగితే, వారికి పూర్తి రీఫండ్ అందజేస్తామని సంస్థ స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్టుల్లో ఉన్న ప్రయాణికుల భద్రత, సౌకర్యాల కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, కలిగిన అసౌకర్యానికి(Inconvenience) క్షమాపణలు తెలుపుతున్నామని వెల్లడించింది. వేలాది మంది ప్రయాణికుల కోసం హోటల్ గదులు, రవాణా, ఆహారం, స్నాక్స్ వంటి సదుపాయాలు అందించామని సంస్థ పేర్కొంది.
Read Also: India-Russia: పుతిన్ భారత పర్యటనతో ప్రయోజనం ఎంత?

అదనంగా, పరిస్థితి సాధారణం అయ్యే వరకు అన్ని ఆపరేషన్ల(operation)ను జాగ్రత్తగా పర్యవేక్షిస్తున్నామని ఇండిగో తెలిపింది. సమస్యలు ఎదుర్కొంటున్న కస్టమర్లకు నిరంతర సహాయం అందించేందుకు ప్రత్యేక సపోర్ట్ టీమ్(Support Team)ను నియమించినట్టు సంస్థ వెల్లడించింది. ప్రయాణికుల భద్రత, సేవల నాణ్యత తమకు అత్యంత ప్రాధాన్యం అని ఇండిగో స్పష్టం చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: