తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మావోయిస్టులపై చర్యలుగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్’కు తాత్కాలికంగా విరామం లభించింది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల చట్రాలను భగ్నం చేయడమే లక్ష్యంగా కేంద్రం ఈ ఆపరేషన్ ప్రారంభించింది. అయితే తాజా పరిస్థితుల్లో ఆపరేషన్ కొనసాగించాల్సిన అవసరం లేదన్న ఉద్దేశ్యంతో కేంద్రం సీఆర్‌పీఎఫ్ బలగాలను వెనక్కి పిలిపించింది.
కర్రెగుట్ట ను వీడుతున్న బలగాలు
కేంద్రం ఆదేశాలతో సీఆర్‌పీఎఫ్ బలగాలు హుటాహుటిన కర్రెగుట్ట ప్రాంతాన్ని విడిచిపెట్టి, తమ హెడ్ క్వార్టర్స్‌కు రిపోర్ట్ చేయడానికి బయలుదేరాయి. భద్రతా దళాల రీడిప్లాయ్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. కాగా, ఈ తాత్కాలిక విరామం తర్వాత పరిస్థితులను బట్టి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయిస్తామని కేంద్ర అధికారులు చెబుతున్నారు.
సీఆర్పీఎఫ్ దళాలు మావోయిస్టుల గుట్టురట్టు
ఇటీవలి కాలంలో కర్రెగుట్ట ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు పెరిగిన నేపథ్యంలో ‘ఆపరేషన్ కగార్’ చేపట్టారు. సీఆర్పీఎఫ్ దళాలు మావోయిస్టుల గుట్టురట్టు చేయడంలో కీలక పాత్ర పోషించాయి. అయితే, ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో భద్రతా సంస్థల తదుపరి దిశ ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.
Read Also : India – Pakistan War : దద్దరిల్లుతున్న జమ్మూకశ్మీర్