हिन्दी | Epaper
కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

Latest News: Bomb Threats: సీఎం స్టాలిన్‌ సహా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు

Anusha
Latest News: Bomb Threats: సీఎం స్టాలిన్‌ సహా సినీ ప్రముఖుల ఇళ్లకు బాంబు బెదిరింపులు

తమిళనాడులో సీఎం ఎంకే స్టాలిన్తో పాటు ప్రముఖ నటులు అజిత్ కుమార్, అరవింద్ స్వామి, ఖుష్బూ సుందర్ నివాసాలను ఆదివారం రాత్రి బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డీజీపీ కార్యాలయానికి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చింది.అప్రమత్తమైన పోలీసులు వెంటనే తనిఖీలు చేపట్టారు.. బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా తనిఖీల చేశారు. అయితే, ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలూ, అనుమానాస్పద వస్తువులూ లభించలేదు. దీంతో అది బూటకపు బెదిరింపుగా పోలీసులు తేల్చారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read Also: Trisha: రూమర్ల వార్తలను ఖండించిన త్రిష

గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు

కాగా, తమిళనాడులోని పలువురు ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలకు గత కొన్నిరోజులుగా వరుస బాంబు బెదిరింపులు (Bomb Threats In Chennai) వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌, టీవీకే చీఫ్‌, ప్రముఖ నటుడు విజయ్‌, ప్రముఖ నటులు త్రిష, నయనతార, ప్రభు, రజినీకాంత్‌, ధనుష్‌, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజా (Ilaiyaraaja) స్టూడియోస్‌, బీజేపీ ప్రధాన కార్యాలయానికి,

డీజీపీ ఆఫీసుకి, రాజ్‌భవన్‌, చెన్నైలోని అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, థాయిలాండ్, శ్రీలంక, సింగపూర్ కార్యాలయాలకు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఈ మెయిల్స్‌ ద్వారా బాంబు బెదిరింపులు (Bomb Threats) వచ్చాయి. చెన్నైలోని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ నివాసానికి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. అయితే, అవన్నీ నకిలీ బెదిరింపులుగా అధికారులు తేల్చారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870