టీవీకే పార్టీ అధినేత, నటుడు విజయ్ (Vijay) కి బాంబు బెదిరింపులు వచ్చాయి. చెన్నైలోని
నీలాంగరైలోని విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు ఆదివారం రాత్రి 9:30 గంటల ప్రాంతంలో
రాష్ట్ర డీజీపీ (State DGP) ఆఫీసుకు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ (E-mail) పంపించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు విజయ్ ఇంట్లో తనిఖీలు చేయగా, పేలుడు పదార్థాలు ఏమి లభించలేదని పోలీసులు తెలిపారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
Stampede: ముందుచూపు లేని అధికారులు

టీవీకే పార్టీ నాయకులపై కేసు నమోదు
కరూర్ లో విజయ్ సభలో తొక్కిసలాట దుర్ఘటనలో నలుగురు టీవీకే పార్టీ (TVK party) నాయకులపై కేసునమోదు చేశారు పోలీసులు. దీంతో మద్రాసు హైకోర్టు (Madras High Court) లో విజయ్ పార్టీ పిటిషన్ వేసింది.పోలీసులు లాఠీఛార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని,
ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని టీవీకే పార్టీ ఆరోపిస్తూ పిల్ వేసింది. తమిళనాడు ప్రభుత్వం (Tamil Nadu Govt) మాత్రం సెట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశించింది. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 41మంది మరణించారు. అనేకులు గాయపడ్డారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: