తమిళనాడులో ఇటీవల చోటుచేసుకున్న కరూర్ తొక్కిసలాట ఘటన ఒక్క సంఘటనగా కాకుండా, రాజకీయ, సామాజికంగా తీవ్ర ప్రభావం చూపింది.నటుడు విజయ్ (Vijay) నేతృత్వంలోని టీవీకే పార్టీ (TVK Party) ర్యాలీలో జరిగిన ఈ దుర్ఘటనపై నటి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఖుష్బూ సుందర్ సంచలన ఆరోపణలు చేశారు.
Chiranjeevi: ఒకేచోట కలిసిన స్టార్ నటులు.. 80s రీయూనియన్
ఇది ప్రమాదవశాత్తు జరిగింది కాదని, పక్కా ప్రణాళికతో, కావాలనే సృష్టించిన ఘటనగా కనిపిస్తోందని ఆమె ఆరోపించారు.ఈ ఘటనలో డీఎంకే ప్రభుత్వ (DMK Govt) నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఖుష్బూ (Khushboo) విమర్శించారు. విజయ్ ర్యాలీకి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే సరైన స్థలం కేటాయించలేదని, దీని వల్లే ఇంత పెద్ద విషాదం జరిగిందని ఆమె ఆరోపించారు.

జనంపై పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని
41 మంది ప్రాణాలు కోల్పోయినా ముఖ్యమంత్రి స్టాలిన్ (Chief Minister Stalin) ఇప్పటివరకు మౌనంగా ఉండటం దారుణమని, ఆయన వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశారు.ర్యాలీలో శాంతియుతంగా ఉన్న జనంపై పోలీసులు ఎందుకు లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చిందని ఆమె ప్రశ్నించారు.
దీనికి సంబంధించిన అనేక వీడియోలు సాక్ష్యంగా ఉన్నాయని గుర్తు చేశారు. మరోవైపు, కరూర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 41 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. ఈ కేసులో ఇప్పటికే పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మద్రాస్ హైకోర్టు (Madras High Court) ఆదేశాల మేరకు ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను ప్రారంభించింది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: