हिन्दी | Epaper

BJP Government: గుజరాత్‌లో టీచర్లకు వీధి కుక్కల సర్వే బాధ్యత

Pooja
BJP Government: గుజరాత్‌లో టీచర్లకు వీధి కుక్కల సర్వే బాధ్యత

గుజరాత్‌లో బీజేపీ ప్రభుత్వం(BJP Government) తీసుకున్న తాజా నిర్ణయం తీవ్ర వివాదానికి దారి తీసింది. పాఠశాలల ప్రాంగణాల్లో, పరిసర ప్రాంతాల్లో తిరుగుతున్న వీధి కుక్కల వివరాలను సేకరించి నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ ఉపాధ్యాయులకు కొత్త బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఈ నెల 11న సర్క్యులర్ జారీ చేసి, మూడు రోజుల్లోనే సర్వే పూర్తిచేయాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు సూచనలను కారణంగా చూపుతూ దీనిని అత్యవసర చర్యగా ప్రభుత్వం పేర్కొంది.

Read Also: BJP: రాహుల్ గాంధీని లోక్‌సభ నుంచి బహిష్కరించాలని దూబే డిమాండ్

BJP Government
BJP Government: Teachers in Gujarat are responsible for surveying stray dogs

ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం.. కాంగ్రెస్ విమర్శలు

ఈ నిర్ణయంపై ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే బోధనతో పాటు ఎన్నికల విధులు, సర్వేలు, ప్రభుత్వ (BJP Government)కార్యక్రమాల పనులతో తాము ఒత్తిడిలో ఉన్నామని వారు వాపోతున్నారు. మరుగుదొడ్ల లెక్కింపు నుంచి జనసమీకరణ వరకు అనేక విద్యేతర పనులు అప్పగించడం వల్ల అసలు బోధనకు సమయం దొరకడం లేదని విమర్శిస్తున్నారు. వీధి కుక్కల గణన కూడా తమకే అప్పగించడం ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని తగ్గించే చర్యగా వారు అభిప్రాయపడుతున్నారు.

ఈ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషి మాట్లాడుతూ, ఉపాధ్యాయులను డేటా సేకరణ యంత్రాలుగా మార్చడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ సర్వే ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే విద్యా ప్రమాణాలు దిగజారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

📢 For Advertisement Booking: 98481 12870