ఆపరేషన్ చేసి ప్రాణాలు కాపాడాల్సిన చేతులే.. అజాగ్రత్తతో ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. (Bihar) బీహార్‌లో మోతిహారీ జిల్లాలో ఏడాది క్రితం వైద్యులు ఓ మహిళకు కాన్పు చేశారు. సిజేరియన్ (Cesarean) చేసి బిడ్డను బయటకు తీసిన వైద్యులు ఆమె కడుపులోనే కత్తెర మరిచిపోయారు. ఆపై కుట్లు వేసి ఇంటికి పంపించి వేశారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో నరకం అనుభవించిన ఆ బాధితురాలు.. చివరికి మరో ఆసుపత్రిలో పరీక్ష చేయించుకోగా కడుపులో 12 సెంటీ మీటర్ల పొడవైన కత్తెర ఉన్నట్లు తేలింది. దీంతో ఆమెకు వెంటనే శస్త్రచికిత్స చేసినప్పటికీ.. కత్తెర వల్ల పేగులు దెబ్బతిని ఇన్ఫెక్షన్ రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది.
Read also: Encounter: పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి

ప్రసవం కోసం వెళ్తే..
బాధితుల కథనం ప్రకారం బీహార్‌లోని మోతిహారీ జిల్లాకు చెందిన మణిభూషణ్ కుమార్‌కు రెండేళ్ల క్రితం పెళ్లి అయింది. (Bihar) వివాహమైన కొంత కాలానికే 25 ఏళ్ల భార్య ఉషాదేవి గర్భం దాల్చగా అంతా మురిసిపోయారు. నెలలు నిండే వరకు ఆమెను చక్కగా చూసుకున్నారు. తమది పేద కుటుంబమే అయినా మంచి వైద్యం ఇప్పించాలని భావించిన మణిభూషణ్ కుమార్ ఆమెను 18 నెలల క్రితం ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడే డాక్టర్ సంగీత కుమారి ఆధ్వర్యంలో ఆమెకు సిజేరియన్ నిర్వహించగా ఆడబిడ్డ జన్మించింది. అయితే ఆపరేషన్ ముగిసే సమయంలో అత్యంత అజాగ్రత్తగా వ్యవహరించిన సదరు వైద్యురాలు సర్జికల్ కత్తెరను ఉషాదేవి కడుపులోనే మరిచిపోయి కుట్లు వేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: