Bihar Results ఏవిధంగానైనా ఈసారి అధికారాన్ని చేపట్టాలని ఎన్నో కలలు కన్న తేజస్వీ యాదవ్ కు ఊహించని షాక్ తగిలింది. ఎన్నో వాగ్దానాలను ఇచ్చినా ప్రజలు వాటిని విశ్వసించలేకపోయారు. ప్రత్యేకంగా ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం అంటూ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. కానీ ఆయన వాగ్దానాలు ప్రజలను ఆకట్టుకోలేకపోయింది. ఎన్డీఏ-జెయుడీలు ఇచ్చిన వాగ్దానాలకే బీహార్ ప్రజలు జైకొట్టారు.
Read Also: MeeSeva: వాట్సాప్‌లోనే మీ-సేవా
దీంతో భారీగా ఎన్డీయే కూటమి గెలిచింది. ఆర్జేడీకి నిరాశే మిగిలింది. నితీశ్ కుమార్ మళ్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. ప్రతిపక్ష నేతగా తేజస్వీ విముకత బీహార్లో ప్రతిపక్ష నేతగా ఉండేందుకు ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ విముకత చూపారు.

ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ
పరాజయానికి బాధ్యత వహిస్తూ.. తేజస్వి (Tejaswi) అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండటనికి నిరాకరించారు. అనంతరం తన తండ్రి, ఆర్జేడీ వ్యవస్థాపకుడు లాలూప్రసాద్ యాదవ్ సర్దిచెప్పడంతో ఆ పదవిలో ఉండేందుకు అంగీకరించినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగింపు..
సోమవారం జరిగిన సమీక్షా సమావేశంలో తాను ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేయాలనుకుంటున్నాని, ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టడం తనకు ఇష్టం లేదని తేజస్వి పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఎన్నికల్లో గెలుపొందడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఓటమి పాలయ్యామని..అందుకు తానే పూర్తి బాధ్యత వహిస్తానని ఆయన అన్నట్లు తెలిపారు. అయితే పార్టీని ముందుకు నడిపించడానికైనా ప్రతిపక్ష నేత స్థానంలో ఉండాలని లాలూ సర్ది చెప్పడంతో చివరికి ఒప్పుకున్నారన్నారు. అదే సమయంలో బీహార్ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన 25మంది ఆర్జేడీ ఎమ్మెల్యేలు.. తమ శాసనసభాపక్ష నేతగా తేజస్విని ఎన్నుకున్నట్లు ఆర్జేడీ అధికార ప్రతినిధి శక్తి సింగ్ తెలిపారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: