బీహార్ ఎన్నికలు (Bihar Results) చాలా ఆసక్తిగా జరిగాయి. చివరి వరకూ ఫలితాలపై తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. అయితే ఎట్టకేలకు బీహార్ లోఎన్డీయే కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీహార్ మహిళలు ఫలితాలను డిసైడ్ చేశారు. మహిళలు ఎన్డీయే వెనుక నిలబడటానికి ఒక ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
Read Also: Bihar Risult: బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన మజ్లిస్ పార్టీ

ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన్ బీహార్ లో ఇప్పటివరకూ జరిగిన ఎన్నికలన్నింటిలో 2025 ఎన్నికలు చాలా ప్రత్యేకం. ఈసారి అత్యంత భారీ సంఖ్యలో ఓటర్లు ఎన్నికల్లో పాల్గొన్నారు. బీహార్ లో ఈ ఏడాది రికార్డుస్థాయిలో 67.13శాతం పోలింగ్ నమోదైంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఓటేశారు.
ఏకంగా 71.78శాతం మంది మహిళలు ఈ ఎన్నికల్లో(election) ఓటేశారు. మహిళల్ని అమితంగా ఆకట్టుకున్న పథకం ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ అనే చెప్పాలి. ఈ పథకం ద్వారా అర్హత కలిగిన మహిళలకు ఏటా రూ.10 వేలు అందుతాయి. సుమారు 1.3కోట్ల మంది మహిళలు ఉన్న ఆ రాష్ట్రంలో ఈ పథకం బాగా ఆకట్టుకుంది. ఇది ఎన్డీయే తిరిగి అధికారంలోకి రావడానికి తోడ్పడింది.
ఒకేసారి పదివేల ఆదాయంతో ఫిదా
ఎన్డీయే కూటమి అమలు చేసిన ‘ముఖ్యమంత్రి మహిళా రోజ్ గార్ యోజన’ స్కీమ్ ద్వారా ఆ రాష్ట్రంలోని మహిళలకు బలమైన ఆర్థిక సాయం అందినట్లయింది. 2022 సర్వే ప్రకారం బీహార్ లోని 34 శాతం కంటే ఎక్కువ కుటుంబాలు నెలకు రూ.6,000 లేదా అంతకంటే తక్కువఆదాయంతో జీవిస్తున్నారని తేలింది.
ఇలాంటి కుటుంబాలకు ఒకేసారి రూ.10వేలు అందడం అనేది చాలా పెద్దవిషయం. దాంతో పథకం ఆగి పోతుందేమో అన్న భయంతో మరొకసారి బీహార్ ప్రజలు నితీష్ కుమారికి(Nitish Kumar) ఓటేసి గెలిపించారని నిపుణులు అభిప్రాయం. అంతేకాక 125 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ పథకం, వృద్ధాప్య పెన్షన్ రూ.1100 పెంచే హామీ వంటి ఆకట్టుకునే పథకాలు కూడా ఎన్డీయే గెలుపుకు కారణం అయ్యింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: