లాలూ (Lalu) ఇంట్లో ముదురుతున్న విభేదాలు.. సోదరిపై చెప్పు విసిరిన తేజస్వి? బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో (Bihar Results) మహాగర్ బంధన్ ఘోర పరాజయం పాలైన తేజస్వీ ఇంకా ఆ షాక్ నుంచి కోలుకోవడం లేదు. ఫలితాలు వెలువడిన రోజు నుంచి లాలూ కుటుంబంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశంలో జరిగిన తీవ్ర ఘర్షణ నేపధ్యంలోనే లాలూ కుమార్తె రోహిణి ఆచార్య రాజకీయాలకు గుడ్ బై చెప్పి, తన కుటుంబంతో కూడా తెగతెంపులు చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Read Also: Latest news: Bihar: 10వ సారి బీహార్ CM నితీష్ కుమార్ ప్రమాణ స్వీకారం

ఒకరిపై ఒకరు మాటల యుద్ధం
ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజున జరిగిన సమీక్షా సమావేశంలోనే తేజస్వీ యాదవ్, (Tejaswi Yadav) ఆయన సోదరి రోహిణి ఆచార్య మధ్య మాటల యుద్ధం జరిగింది. ఆర్జేడీ ఎంపీ సంజయ్ యాదవ్ పై పార్టీ కార్యకర్తల నిరసనలకు సంబంధించి రోహిణి ఒక సూచన చేయగా.. తేజస్వీ దానిని తీవ్రంగా వ్యతిరేకించాడు. అనంతరం తేజస్వీ తన సోదరిని ఉద్దేశించి ‘నీవల్లే మేం ఎన్నికల్లో ఓడిపోయాం.. నువ్వు మాకు శాపంగా మారావు’ అని తీవ్ర పదజాలంతో దూషించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. అంతేకాకుండా ఆగ్రహంతో అతను తన సోదరిపైకి చెప్పు విసిరినట్లు సమాచారం.
తీవ్ర ఆవేదన చెందిన రోహిణి
ఈ అవమానం రోహిణిని (Rohini) తీవ్రంగా కలచివేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆమె వెంటనే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఎక్స్ వేదికగా రోహిణి ప్రకటించారు. అలాగే కుటుంబం నుంచి కూడా తెగదెంపులు చేసుకున్నట్లు ప్రకటించారు. నన్ను సంజయ్ యాదవ్ చేయమని అడిగిందే ఇదే అని రోహిణి ఆరోపించారు. కాగా రోహిణి తన తండ్రి లాలూ యాదవ్ కు కిడ్నీ దానం చేసిన విషయం తెలిసిందే.
అవును ఓడితే నీవల్లే ఓడామని.. గెలిస్తే దానికి నేనే బాధ్యుడిని అని అనడం సహజమే. ఓటమి ఇతరులపై సులభంగా ఇతరులపై నెట్టి, తమ తప్పు ఏమీ లేదని నిరూపించుకునే ప్రయత్నంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. తేజస్వీ యాదవ్ కూడా తన సోదరి విషయంలో ఇదే తప్పు చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: