దేశవ్యాప్తంగా 8 అసెంబ్లీ (Bihar Results)నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. జమ్మూకాశ్మీర్ లోని నగ్రోటాలో బీజపీ జయభేరి మోగించగా, బడ్గంలో పీడీపీ గెలిచింది. రాజస్థాన్ లోని ఆంటా స్థానాన్ని కాంగ్రెస్, ఒడిశాలోని నువాపడా నియోజకవర్గాన్ని బీజేపీ నిలబెట్టుకునే దిశగా సాగుతోంది. మిజోరంలోని డంపాలో ఎంఎన్ ఎఫ్ గెలుపొందింది.
పంజాబ్ లోని తరణ్ తరణ్ ను ఆప్ నిలబెట్టుకుంది. ఝార్ఖండ్ లోని ఘట్సిలాలో ఝార్ఖండ్ ముక్తి మోర్చ ఆధికర్యంలో సాగుతోంది. రాజస్థాన్లోని ఆంటా ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి ప్రమోద్ జైన్ 15,6000కిపైగా ఓట్ల.
Read Also: Stock market: లాభాల్లోకి దూసుకెళ్లిన మార్కెట్లు

మెజార్టీతో బీజేపీ అభ్యర్థి
మోర్ఫాల్ సుమన్ పై గెలుపొందారు. గత ఎన్నికల్లో ప్రమోద్ జైన్ బీజేపీ అభ్యర్థి కన్వర్ లాల్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఒక క్రిమినల్ కేసులో కన్వర్ లాల్ దోషిగా తేలడంతో ఆయనపై అనర్హత వేటు పడి ఇక్కడ ఉప ఎన్నికల అనివార్యం అయింది.
ఇతర ప్రాంతాల్లో గెలుపొందిన అభ్యర్థులు
జమ్మూకాశ్మీర్ లోని(Jammu and Kashmir) నగ్రోటా స్థానాన్ని బీజేపీ నిలబెట్టుకుంది. మహిళా వ్యాపారవేత్త, బీజేపీ అభ్యర్థి దేవ్ యానీ రాణా భారీ ఆధీక్యంతో జమ్మూ కాశ్మీర్ నేషనల్ పాంథర్స్ పార్టీ అభ్యర్థి హర్ష్ దేవ్ సింగ్ పై గెలుపొందారు. ఎమ్మెల్యే దేవేందర్ సింగ్ రాణా మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నికల నిర్వహించారు. తెలంగాణలో అత్యంత ఉత్కంఠ రేపిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. నవీన్ యాదవ్ కు 24,729 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: