సమాజంలో మహిళలు అంటే చిన్నచూపు ఇంకా సమసిపోలేదు. గొప్పచదువులు చదివినా, మంచి ఉద్యోగంతో సంపాదిస్తున్నా ఆమెపై ఉన్న వివక్షపోవడం లేదు. వారిని కోరికలు తీర్చే వస్తువుగా భావించే భావన పూర్తిగా పోలేదనిపిస్తుంది ఈ ఉదంతం చదివితే.. దీనికి సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. పశ్చిమబెంగాల్ (West Bengal) నుంచి బిహార్ కు తరలిస్తున్న అతిపెద్ద మహిళల అక్రమ రవాణా గుట్టురట్టయింది. ఉద్యోగాల పేరుతో వీరిని నమ్మించి మోసంచేసినట్లు తేలడంతో యువతులతోపాటు వారిని తరలిస్తున్న ముఠా సభ్యులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన, వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ నుంచి ఓ రైలు బిహార్ బయల్దేరింది. అయితే ఆ రైలు పెద్ద సంఖ్యలో యువతులు కలిసికట్టుగా ఓకే బోగిలో
ఎక్కారు.
అప్రమత్తమైన,అధికారులు
అలా అంతా కలిసి వెళ్లడం సాధారణమే అయినప్పటికీ వారి వద్ద ఎలాంటి పత్రాలు లేకపోవడం, అందరూ ఆందోళనలో ఉండటంతో రైల్వే సిబ్బంది (Railway staff) కి సందేహం వచ్చింది. అంతేకాక, వారందరి చేతులపై స్టాంప్లు ఉండటం మరింత అనుమానాలకు తావిచ్చింది. వెంటనే అప్రమత్తమైన,అధికారులు వారి గురించి ఆరా తీయడంతో అసలు విషయం వెలుగుచూసింది. వారిని అక్రమ రవాణాలో భాగంగానే బిహార్ తరలిస్తున్నట్లు తేలింది.56 మంది యువతులు
సోమవారం రాత్రి పశ్చిమబెంగాల్లో 56మంది యువతులు న్యూ జల్సా యురి-పటట్నా క్యాపిటల్ ఎక్స్ప్రెస్లో ఎక్కారు. అంతా ఒకే బోగీలో ఎక్కారు.వీరితోపాటు ఓ మహిళ, పురుషుడు ఉన్నారు. సాధారణ తనిఖీల్లో భాగంగా ఆర్పీఎఫ్ సిబ్బంది వీరున్న బోగీవద్దకు వచ్చారు.

చేతులపై కోచ్, బెర్త్ నంబర్లు
వారిని టికెట్లు చూపించమని అడిగారు. కానీ, టికెట్లుగానీ, ఇతర ఎలాంటి ఆధారాలు కానీ, వారివద్ద లేవు.యువతుల చేతులపై కోచ్, బెర్త్ నంబర్లు ముద్రించి ఉన్నాయి. దీంతో వారి వెంట ఉన్నవారిని ప్రశ్నించారు. సరైన సమాధానం రాలేదు. కొంతమందియువతులు మాత్రం బెంగళూరుకు చెందిన కంపెనీలో ఉద్యోగం కోసం తమను రైల్లో తీసుకెళ్లున్నారని చెప్పారు. బెంగళూరులో ఉద్యోగమైతే బిహార్ (Bihar) కు ఎందుకు తీసుకెళ్తున్నారని వారితో ఉన్న వ్యక్తులను సిబ్బంది ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో రైల్వేసిబ్బంది వారినిఅనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. మహిళల అక్రమరవాణాలో భాగంగానే వీరిని బిహార్ తరలిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.
మహిళలను అక్రమరవాణ చేస్తున్న ముఠాలకు
అనంతరం ఆ యువతులందరినీ రక్షించిన అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. వీరంతా 18-31ఏళ్ల లోపు వారే కావడం గమనార్హం.కేసు నమోదు చేసి, రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆధునిక యుగంలో కూడా మహిళలను అక్రమరవాణ చేస్తున్న ముఠాలకు కొదువ లేదు.పేదరికం, అవసరాలను గమనించి పేద మహిళలను, ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నవారిని టార్గెట్ చేసి, మాయమాటలతో మహిళలను అక్రమంగా రవాణా చేసే ముఠాలు సమాజంలో లేకుండా చేయాలి.
మహిళల అక్రమ రవాణా అంటే ఏమిటి?
మహిళలను బలవంతంగా లేదా మోసపూరితంగా వలస ప్రాంతాలకు తీసుకెళ్లి వేశ్యావృత్తి, బానిసత్వం, బలవంతపు పెళ్లిళ్లు,వంటి అక్రమ పనులకు వినియోగించడాన్ని మహిళల అక్రమ రవాణా అంటారు.
మహిళల అక్రమ రవాణాకు ప్రధాన కారణాలు ఏమిటి?
పేదరికం,నిరక్షరాస్యత,ఉద్యోగావకాశాల లేమి,కుటుంబ సమస్యలు,మోసపూరిత వాగ్దానాలు,మహిళలపై తక్కువ అభిమానం.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Vice president: ఉపరాష్ట్రపతి రేస్లో ఐదుగురు.. కసరత్తు ముమ్మరం