Social media rules : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సోషల్ మీడియా వినియోగంపై బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతాలు ఉపయోగించాలంటే తప్పనిసరిగా ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ వంటి వేదికల కోసం ప్రత్యేక మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉన్నత స్థాయి నుంచి కిందిస్థాయి ఉద్యోగుల వరకూ అందరికీ వర్తిస్తాయని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఉద్యోగులు సోషల్ మీడియా వాడకాన్ని పూర్తిగా నిషేధించడం తమ ఉద్దేశం కాదని బిహార్ సర్కార్ తెలిపింది. అయితే, వారు హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలనే లక్ష్యంతోనే ఈ మార్గదర్శకాలు రూపొందించామని పేర్కొంది. ఇప్పటికే ఈ నిబంధనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు.
Read Also: KCR phone tapping case : కేసీఆర్ ఇంటికి సిట్ అధికారులు! ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు

కొత్త మార్గదర్శకాల ప్రకారం, ప్రభుత్వ ఉద్యోగులు కొత్త సోషల్ మీడియా అకౌంట్ తెరవాలంటే ముందుగా సంబంధిత ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. నకిలీ ఖాతాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తిగత అకౌంట్లలో ప్రభుత్వ హోదా, ప్రభుత్వ లోగో లేదా అధికారిక గుర్తింపులను ఉపయోగించరాదని ఆదేశించింది.
అలాగే, వ్యక్తిగత సోషల్ మీడియా అకౌంట్లకు ప్రభుత్వ ఈమెయిల్ ఐడీలు, అధికారిక ఫోన్ నెంబర్లు లింక్ చేయరాదని తెలిపింది. ఉద్యోగుల వ్యక్తిగత అభిప్రాయాలకు ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చూపించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం పేర్కొంది.
అశ్లీల కంటెంట్, కుల, మతాలను టార్గెట్ చేసే పోస్టులు, సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే అంశాలపై పూర్తిగా నిషేధం విధించారు. అలాగే అధికారిక సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేయకూడదని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: