అసెంబ్లీ ఎన్నికల వేళ బీహార్ రాజకీయాల్లో కీలక (Bihar Elections) పరిణామం చోటుచేసుకున్నది. అధికార జనతాదళ్ యునైటెడ్‌కి చెందిన నేతలు ఒక్కక్కరిగా ఆ పార్టీని వీడుతున్నారు. విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలో చేరుతున్నారు. ఇందులో భాగంగా జేడీయూ మాజీ ఎంపీ సంతోశ్ కుశ్వాహా ఆర్జేడీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మరోవైపు ప్రస్తుతం బంకా నియోజకవర్గ ఎంపీ గిరిధారి యాదవ్ కుమారుడు చాణక్య ప్రకాశ్ రంజన్, జహనాబాద్ మాజీ ఎంపీ జగదీశ్ శర్మ కుమారుడు రాహుల్ శర్మ కూడా జేడీయూకి రాజీనామా చేశారు. తేజస్వీ యాదవ్ సమక్షంలో ఆర్జేడీలో చేరనున్నారు. దీంతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనుకుంటున్న సీఎం నితీశ్ కుమార్‌కు సీనియర్ నేతలు పార్టీని వీడుతుండటంతో ఎదురుదెబ్బ తగిలినట్లయింది.పూర్నియా ప్రాంతంలో కుశ్వాహా జేడీయూలో ప్రముఖ నేతగా ఎదిగారు. ఆయన ఆర్జేడీలో చేరనుండటంతో పార్టీ ఓటు బ్యాంకును భారీగా చీల్చే అవకాశం ఉన్నదని. అదేవిధంగా రాహుల్ శర్మ గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. చాణక్య ప్రకాశ్ జేడీయూ ఎంపీ గిరిధారి యాదవ్ కుమారుడు కావడంతో బంకా నియోజకవర్గంలో ఆర్జేడీకీ మరింత బలం చేకూరనుంది.

కాగా, రెండు దశల్లో జరుగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు (Bihar Elections) కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించింది. మొదటి దశలో జరుగనున్న 121 అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదటి విడత ఎన్నికలు నవంబర్ 6న జరుగనున్నాయి. ఇక రెండో దశలో 122 స్థానాల్లో నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 243 స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Elections)ఫలితాలు నవంబర్ 14న విడుదల కానున్నాయి. తొలి దశలో.. ఉత్తర, దక్షిణ బీహార్‌లోని 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతాయి. వీటిలో పాట్నా, దర్భంగా, మధుపుర, సహస్ర, ముజఫ్ఫర్‌పూర్, గోపాల్‌గంజ్, సీవాన్, సారణ్, వైశాలి, సమస్తీపూర్, బెగూసరాయ్, లఖీసరాయ్, ముంగేర్, షేక్పూరా, నలందా, బక్సర్, భోజ్‌పూర్ జిల్లాలు ఉన్నాయి.
2025 బీహార్ శాసనసభ ఎన్నికలు ఎప్పుడు ?
బీహార్ శాసనసభకు శాసనసభ్యులను ఎన్నుకొనుటకు 2025 అక్టోబరు లేదా నవంబరులో ఎన్నికలు జరగాల్సిఉంది. శాసనసభ స్థానాలు మొత్తం 243.
బీహార్ శాసనసభ ఎన్నికల నేపథ్యం?
గత అసెంబ్లీ ఎన్నికలు 2020 అక్టోబరు-నవంబరులో జరిగాయి. ఎన్నికల తరువాత, జాతీయ ప్రజాస్వామ్య కూటమి రాష్ట్రప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. నితీష్ కుమార్ ముఖ్యమంత్రి అయ్యారు. తరువాత, 2022 ఆగస్టులో నితీష్ కుమార్ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమితో సంబంధాలను తెంచుకుని, ఆర్జెడి నేతృత్వంలోని మహాఘటబంధన్తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తరువాత 2024 జనవరిలో నితీష్ కుమార్ నేతృత్వంలోని జెడి (యు) ఆర్జెడి నేతృత్వంలోని మహాఘటబంధన్తో సంబంధాలు తెంచుకుని, బిజెపి నేతృత్వంలోని ఎన్డిఎతో మళ్లీ ప్రభుత్వాన్నిఏర్పాటుచేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: