Bihar Elections: బీహార్ (Bihar) రాజకీయాల్లో జేడీయూ చేసిన తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముస్లిం ఓటర్లపై ఆధారపడే రాజకీయాన్ని వదిలి, కొత్త వ్యూహం అవలంబిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈసారి 101 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న జేడీయూ, అందులో కేవలం నలుగురు ముస్లిం అభ్యర్థులకు మాత్రమే టికెట్లు కేటాయించింది. గత ఎన్నికల్లో 11 మందికి అవకాశం ఇచ్చినా, వారిలో ఒక్కరికి కూడా విజయం దక్కలేదు. అదే సమయంలో, ఐఎంఐఎం పార్టీ ఐదు స్థానాల్లో విజయం సాధించడం జేడీయూ లోపల ఆత్మపరిశీలనకు దారితీసింది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, బీజేపీతో కూటమి కొనసాగుతున్నంత కాలం ముస్లిం ఓట్లు తమకు రాకపోవచ్చనే స్పష్టత జేడీయూకు వచ్చిందని చెబుతున్నారు. 2015లో ఆర్జేడీ, కాంగ్రెస్‌లతో కలసి పోటీ చేసినప్పుడు 7 మంది ముస్లిం అభ్యర్థుల్లో 5 మంది విజయం సాధించిన విషయం గుర్తుచేస్తున్నారు.
Read also: Prashanthi Reddy: జిఎస్టి 2.0తో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు

Bihar Elections
నితీశ్ కుమార్‌కు
తాజాగా పార్టీ నేతల వ్యాఖ్యలు కూడా ఈ మార్పును బలపరుస్తున్నాయి. సీనియర్ నేత లలన్ సింగ్ “ముస్లింలు ఎప్పుడూ నితీశ్ కుమార్‌కు (Nithish kumar) ఓటు వేయలేదు” అని చేసిన వ్యాఖ్య, అలాగే ఎంపీ దేవేశ్ చంద్ర ఠాకూర్ చేసిన “ముస్లింలు, యాదవుల వ్యక్తిగత పనులు చేయను” అనే వ్యాఖ్యలతో పార్టీ ధోరణి మరింత స్పష్టమవుతోంది. ఇదే సమయంలో, వక్ఫ్ సవరణ బిల్లుకు జేడీయూ మద్దతు ఇవ్వడం కూడా మైనారిటీ ఓటర్లకు పార్టీ దూరమవుతున్న సంకేతంగా భావిస్తున్నారు. పార్టీ అంతర్గతంగా, “ఎన్ని పథకాలు అమలు చేసినా ఓట్లు రాకపోతే, కొత్త దారిలో నడవాల్సిందే” అన్న అభిప్రాయం బలపడుతోంది.
జేడీయూ ఎన్ని ముస్లిం అభ్యర్థులకు టికెట్లు ఇచ్చింది?
101 స్థానాల్లో కేవలం నలుగురికే టికెట్లు ఇచ్చింది.
ఈ మార్పుకు కారణం ఏమిటి?
బీజేపీతో కూటమి ఉన్నప్పుడు ముస్లిం ఓట్లు రాకపోవడం వల్ల.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: